రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) మే 14:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో సగర సంఘం సభ్యుల ఆధ్వర్యంలో భగీరథ మహర్షి జయంతి వేడుకలు మంగళవారం రోజు ఘనంగా నిర్వహించారు. మొదటగా చిత్తారమ్మ దేవాలయంలో ఘనంగా పూజలు నిర్వహించి భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి భారీ ఎత్తున 300 మంది సగరులతో ఘనంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించి వివేకానంద విగ్రహానికి, శివాజీ విగ్రహానికి, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మర్కు దత్తు, సగర భూషణం, మాట్లాడుతూ.. భగీరథుడు ఘోర తపస్సు చేసి గంగను భూవీ మీదికి తీసుకువచ్చారని, సగరులు అన్నారు. భగీరథ మహర్షి ప్రయత్నం లాగే ప్రతి ఒక్కరూ సమాజంలో సేవా కార్యక్రమాలు చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సగర సంఘం ఒకటవ బేడ, రెండవ బేడ అధ్యక్షులు దేశాయిపేట నాగభూషణం. మర్కు భూమయ్య. కోశాధికారులు రేవెల్లి సురేష్. రామారాపు రమేష్. దోమకొండ పెద్ద సిద్దరాములు. మర్కు బాలరాజ్.. కొరుగుల మల్లేశం. అచ్చయ్య. మర్కు కిష్టయ్య. సగరులు తదితరులు పాల్గొన్నారు.