కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం సరండి గ్రామపంచాయతీ గ్రామంలోని అధికారులు ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో గ్రామానికి చెందిన యువకులు తమ ఓటు హక్కు వినియోగించు కున్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కును అందరూ వినియోగించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. దేశ భవిష్యత్తును నిర్ణయించేది ఓటేనని కొంతమంది యువకులు ఓటు హక్కు వినియోగించకొకపోవడం దేశాభివృద్ధిని తిరస్కరించినట్లేనని చెప్పారు. ఓటు హక్కు పై ప్రతి ఒక్కరూ సమాజంలో అవగాహన కల్పించి ఓటు హక్కు వినియోగించుకునేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.