Reporter -Silver Rajesh Medak.
Date- 13.05.2024.
ఓటు హక్కు వినియోగించుకున్న మెదక్ జిల్లా అదనపు ఎస్.పి.ఎస్.మహేందర్ .
లోక్ సభ ఎన్నికల్లో భాగంగా మెదక్ పట్టణంలోని బాయ్స్ జూనియర్ కాలేజీలో జిల్లా అదనపు ఎస్.పి శ్రీ.ఎస్.మహేందర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ మాట్లాడుతూ..బాద్యతాయుత పౌరుని చేతిలో బ్రహ్మస్త్రం ఓటు అని సమాజంలో ప్రతి ఒక్కరికి ఓటు ఒక వజ్రాయుధం ప్రస్తుత ఎన్నికల సమయంలో ప్రతి పౌరుడికి ఓటు ఎంతో కీలకం ప్రపంచ స్థితిగతులను మార్చే శక్తి కేవలం ఒక ఓటుకే ఉంటుంది భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు తమ కర్తవ్యాన్ని గుర్తించి ఓటు వేయాలి తమ వంతు బాధ్యతగా తమ ఓటు హక్కును కచ్చితంగా వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరూ తన ఓటును ప్రలోభాలకు గురికాకుండా నిర్భయంగా వినియోగించుకోవాలని ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కుకు చాలా ప్రాధాన్యం ఉన్నదని ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న ఎన్నికల్లో పౌరులు ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు. అలాగే బాయ్స్ జూనియర్ కాలేజీలో ఉన్న ఎన్నికల భద్రత సిబ్బందికి పలు సూచనలు చేయడమైనది. అలాగే ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు సంబంధిత అధికారుల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుతంగా వినియోగించుకునేలా పోలీస్ సిబ్బంది వారికి భద్రత కల్పిస్తూ, పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని, ఎన్నికల నిర్వహణ గురించి పలు సూచనలు చేశారు.