Reporter -Silver Rajesh Medak.
Date-13/05/2024.
జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
- సాయంత్రం 05.00 గంటల వరకూ మెదక్ పార్లమెంట్ నియోజవర్గం లో 71.33శాతం పోలింగ్ ( తుది పోలింగ్ నమోదు శాతం వచ్చేందుకు ఇంకా టైం పడుతుంది )
- సాయంత్రం 06.00 గంటల లోపు క్యూ లైన్ లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం
- జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్.
మెదక్ పార్లమెంటు నియోజకవర్గాల్లో . ఎన్నికల పోలింగ్ కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ సజావుగా ముగిసింది.
ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహన.
కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు సాయంత్రం 6 గంటలలోపు పోలింగ్ స్టేషన్ల క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించినట్లు అధికారులు స్పష్టం చేశారు.
ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం ఈవిఎం లను నర్సాపూర్ BVRIT కాలేజీ లో ఏర్పాటుచేసిన రిసెప్షన్ సెంటర్ కు తరలించి అక్కడ ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూములో భద్రపరచనున్నారు.
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లోని సమావేశమందిరంలో లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూం నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా అదనపు కలెక్టర్ వేంకటేశ్వర్లు పరిశీలించారు.
పార్లమెంట్ ఎన్నికలు నిర్వహణలో భాగంగా పోలింగ్ ప్రక్రియ సక్రమంగా, సజావుగా నిర్వహించడంలో జిల్లా యంత్రాంగానికి సహకరించిన ఓటర్లకు, ప్రజలకు భాగస్వాములైన అధికార యంత్రాంగాన్ని ఆయన అభినందించారు. ఎన్నికల సమాచారం ఎప్పటి కపుడు ప్రచార మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరవేసిన మీడియా ప్రతినిధులను ఆయన అభినందిచారు.