నార్సింగి : రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నడిచిన లోక్ సభ ఎన్నికల మండలం లో ప్రశాంతంగా ముగిశాయి. నార్సింగి ఎంపీపీ చిందం సబితా రవీందర్ తన స్వగ్రామమైన వల్లూరు లో ఓటు హక్కును వినియో గించుకోగా జెడ్పీటీసీ బానాపురం కృష్ణా రెడ్డి వల్లభాపూర్ లో, ఎంపిటిసి ఆకుల సుజాత మల్లేశం గౌడ్ మండల బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు మైలారం బాబు, పట్టణ అధ్యక్షుడు విష్ణు వర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ ఛైర్మన్ రాజేందర్ రెడ్డి, జామియా మస్జిద్ కమిటీ అధ్యక్షుడు ఎండీ చాంద్ ఖురేషి, కాంగ్రెస్ మండల్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఉబ్బరిగల్ల రవీందర్ లు నార్సింగి లో ఓటు వేశారు. మండలం లో మొత్తం 13010 ఓట్లు ఉండగా, మండల వ్యాప్తంగా 18 పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేశారు. సోమవారం జరిగిన పార్లిమెంట్ ఎన్నికలలో మండల వ్యాప్తంగా 81 శాతం పోలింగ్ జరిగినట్లు మండల ఎన్నికల అధికారి, తహశీల్దార్ షేక్ కరీం తెలిపారు. వల్లూరు లో బూత్ నెం 219 లో తొలుత ఈవీఎం మోరాయించగా, ఎన్నికల సిబ్బంది సమస్యను పరిష్కరించారు. దానివల్ల 40 నిమిషాలు పోలింగ్ కు అంతరాయం కలిగింది. మొత్తం మీద మండలం లో ఓటింగ్ మెరుగ్గా, ప్రశాంతంగా జరిగిందని షేక్ కరీం హర్షం వ్యక్తం చేశారు.