రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) మే 13:- మెదక్ జిల్లా రామాయంపేట మండల వ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల సందర్భంగా సోమవారం ఉదయం 7 గంటల నుండి బారులు తీరిన ఓటర్లు ఓట్లు వేసిన వృద్ధురాలు వికలాంగులు చంటి పిల్లల తల్లులు సైతం ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంటరీ సార్వత్రిక ఎన్నికలు జరిగిన మండలంలో పోలింగ్లో ఓటర్ ఉత్సవంగా ఉదయం నుండి పాల్గొన్నారు. మండలంలో 82 శాతం పోలింగ్ జరిగింది. దామరచెరువు మాజీ మంత్రి కేటీఆర్ అత్తగారి గ్రామంలో 7 గంటల నుండి ప్రజలు ఓట్లు వేయడానికి అత్యధిక సంఖ్యలో బారులు తీరారు.అక్కన్నపేట ధర్మారం కాట్రియాల లక్ష్మాపూర్ గ్రామాల్లో ప్రశాంతంగా పోలింగ్ జరిగింది ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. అధికారులు ఎప్పటికప్పుడు పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తూ జాగ్రత్తగా కార్యక్రమాలు నిర్వహించారు. రామాయంపేట మున్సిపల్ పోలింగ్ కేంద్రంలో 85 సంవత్సరాల వృద్ధురాలు తన మనుమల సాయంతో ఓటు వేయడం కనిపించింది. వికలాంగులు వాహనాలపై వచ్చి తమ ఓటును వినియోగించుకున్నారు. ఎస్సీ కాలనీ పోలింగ్ కేంద్రాల్లో చంటి పిల్లల తల్లులు తమ పిల్లలను ఎత్తుకొని క్యూలో నిలబడి ఓట్లు వేయడం కనిపించింది. మున్సిపల్ పరిధిలోని ఎస్సీ కాలనీ పోలింగ్ కేంద్రంలో అతివేగంగా పోలింగ్ జరిగి అత్యధిక ఓట్లు పోలయ్యాయి. ఐదో వార్డు పది పదకొండు వార్డుల్లో మందకొడిగా పోలింగ్ నమోదయ్యాయి. మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి తన స్వగ్రామంలో కోనాపూర్ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ రామాయంపేట పోలింగ్ సరళి ఆయన పరిశీలించారు. రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ ఓటును వినియోగించుకున్నారు.మొత్తం మీద రామాయంపేట మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పార్లమెంటు ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి.