చేవెళ్ల నియోజకవర్గం కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం నాడు కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్న టిపిసిసి క్యాంపెయిన్ కమిటీ జాయింట్ కన్వీనర్ సున్నపు వసంతం… ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకుని ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పాటుపడాలని సూచించారు.