Reporter -Silver Rajesh Medak.
Date – 10.05.2024.
ఉజ్వల భవిష్యత్తు కోసం విద్య ఒక ముఖ్యమైన సాధనం
చదువు అనే సాధనంతో జీవితంలో ఏదైనా సాధించవచ్చు
విజ్ఞాన విద్యా ధనం ఆర్జించండి చదువులేకుంటే అన్నీ నిష్ప్రయోజనమే
చదువుకోండి స్వశక్తితో నిలవండి,
విద్యావంతులైతేనే సమాజ గమనం అభివృద్ధి వైపు పయనిస్తుంది
సమాజాభివృద్ధిలో వారే క్రియాశీలక పాత్ర పోషించగలరు
జిల్లా ఎస్.పి డా.బి.బాలస్వామి ఐ.పి.ఎస్.
ఈ రోజు మెదక్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు నిర్వహించిన ఆన్యువల్ డే సందర్భంగా ముఖ్య అతిది గా జిల్లా ఎస్.పి డా.బి.బాలస్వామి ఐ.పి.ఎస్. హాజరైనారు.ఈ కార్యాక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రాంబించినారు.ఈ సందర్బంగా జిల్లా ఎస్.పి డా.బి.బాలస్వామి ఐ.పి.ఎస్. గారు మాట్లాడుతూ… ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్ధులు ఉన్నతమైన ఆశయాలను కలిగి ఉండాలని సమాజంలోని సకల వివక్షలకు మూలం అవిద్య, అజ్ఞానం అని విద్యాబ్యాస సమయంలో చదువుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మధ్యతరగతి కుటుంబాల పిల్లలు ఎట్లాగైనా కష్టపడి చదువుకోవాలని, విద్యావంతులైతే సమాజ గమనం అభివృద్ధి వైపు పయనిస్తుందని సమాజాభివృద్ధిలో వారే క్రియాశీలక పాత్రను పోషించగలరని అలాగే చదువు జీవితాలనే మార్చేస్తుందని మనపై మనకి నమ్మకాన్ని కలిగిస్తుందని ముఖ్యంగా మన మాట తీరు, నడవడిక, వేష ధారణ మార్చేస్తుందని మనకు పట్టుదల, ఆత్మ విశ్వాసం కలిగేలా చేస్తుందని సరైన నిర్ణయం తీసుకోడానికి ఉపయోగపడుతుందని చదువు వల్ల మనో వికాసం పెరుగుతుందని అన్నారు.
పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకోవాలి తద్వారా భావోద్వేగ సమతుల్యతను పాటిస్తూ, ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరూ జీవితంలో ముందుకు సాగి విజయం సాధించాలంటే మెరుగైన విద్య చాలా అవసరంఅని ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని మరియు వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని నిర్మించడంలో సహాయపడుతుందని ప్రతి ఒక్కరి జీవితంలో పాఠశాల విద్య గొప్ప పాత్ర పోషిస్తుంది.
ప్రాథమిక విద్య జీవితాంతం సహాయపడే పునాదిని సిద్ధం చేస్తుంది మాధ్యమిక విద్య తదుపరి అధ్యయనానికి మార్గాన్ని సిద్ధం చేస్తుంది మరియు ఉన్నత మాధ్యమిక విద్య భవిష్యత్తు మరియు మొత్తం జీవితానికి అంతిమ మార్గాన్ని సిద్ధం చేస్తుంది. అలాగే మనందరికీ ఉజ్వల భవిష్యత్తు కోసం విద్య ఒక ముఖ్యమైన సాధనం చదువు అనే సాధనంతో జీవితంలో ఏదైనా మంచి సాధించవచ్చు ఉన్నత స్థాయి విద్య వల్ల సామాజిక మరియు కుటుంబ గౌరవం ప్రత్యేక గుర్తింపును సంపాదించడంలో సహాయపడుతుంది. వ్యక్తిగతంగా మరియు సామాజికంగా ప్రతి ఒక్కరికీ విద్యా సమయం అనేది జీవితంలో కీలకమైన భాగం అని అన్నారు.
అలాగే విద్యాభ్యాస స్నేహం గురించి వివరిస్తూ స్నేహం ఒక తీయని జ్ఞాపకం అని జీవిత ప్రయాణంలో స్నేహ బంధానికి మించింది లేదని బాల్య దశలో బలపడే స్నేహం ఎలాంటి రక్త సంబంధం లేకపోయిన ఓ బంధంతో అమితమైన ప్రేమ, ఇష్టాన్ని కలిగి ఉండేదే స్నేహ బంధం అని ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహితుడు తప్పనిసరిగా ఉంటాడని విద్యాభ్యాస సమయంలో ఏర్పడే స్నేహితులను ఎప్పుడు మరవద్దని ఈ సందర్భంగా అన్నారు.అనంతరం కలాశాలలో నిర్వహించిన వివిద పోటీల్లో గెలుపొందిన విద్యార్ధులకు బహుమతులను అందజేసి వారిని అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డా. హుస్సైన్ గారు, వైస్ ప్రిన్సిపల్ గణపతి గారు, ఏ. సింహారెడ్డి గారు డా.తిరుమల రెడ్డి గారు డా.ఏ.సుధాకర్ గారు శ్వెంకటేశ్వర్లు ఎం. వేణుగోపాల్ శర్మ సిబ్బంది పాల్గొన్నారు.