Reporter -Silver Rajesh Medak.
Date-10.05.2024.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు మెదక్ జిల్లా పోలీస్ అబ్జర్వర్ శ్రీ.డాక్టర్ రామేశ్వర్ సింగ్, డిఐజి ఐపీఎస్ జిల్లాలో కల ఎన్నికల పోలింగ్ స్టేషన్ లను మరియు చెక్ పోస్ట్ లను సందర్శించి అక్కడికి పరిస్థితులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ అబ్జర్వర్ శ్రీ.డాక్టర్ రామేశ్వర్ సింగ్, డిఐజి ఐపీఎస్ సిబ్బందికి పలు సూచనలు చేయడం జరిగింది. అలాగే ఎన్నికలను ప్రభావితం చేసే ఎలాంటి అనుమానాస్పద అంశం తమ దృష్టికి వచ్చిన క్షుణ్ణంగా పరిశీలించాలని ఎన్నికల పోలీస్ పరిశీలకులు డాక్టర్ రామేశ్వర్ సింగ్, ఐపిఎస్ డీఐజీ ఆదేశించారు. ఎన్నికలకు సంబంధించిన ప్రభావిత అంశాల పైనే దృష్టి పెట్టాలని అలాగే ఎన్నికలకు సంబంధించిన నివేదికలు ఎప్పటికప్పుడు నివేదించాలని ఆదేశించారు.అలాగే పార్లమెంట్ ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల పరిశీలకులుగా తాము వచ్చినట్లు గత ఎన్నికల్లో మాదిరిగానే ఈ సారి ఎన్నికలలో పోలింగ్ శాతం పెరిగే విధంగా ప్రజలు నిర్భయంగా వచ్చి తమ ఓటును వినియోగించుకునే విధంగా కృషి చేయాలని సిబ్బందికి తెలిపారు. అలాగే ఎన్నికలలో అప్రమత్తంగా విదులు నిర్వహించాలని అలసత్వం చేయకూడదని ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాల్సిన భాద్యత మన పై ఉంటుందని ఎన్నికల్లోని అన్నీ అంశాల పై చాలా జాగ్రత్త గా వ్యవహరించాల్సి ఉంటుందని అన్నారు.