Reporter -Silver Rajesh Medak.
Date-10/05/2024.
ఈవీఎంల భద్రత పోలీసుల బాధ్యత.ఎన్నికల విధులను సక్రమంగా నిర్వర్తించాలి. పోలీస్ సిబ్బందికి, కేంద్ర బలగాలకు ఎన్నికల విధులపై సూచనలు
పోలింగ్ స్టేషన్ వద్ద, మొబైల్ వెహికల్, రూట్ బందోబస్తు లో, స్ట్రాంగ్ రూములు తదితర అంశాలపై అవగాహన.
సిబ్బంది చేయవలసిన విధులు, సూచనలకు సంబంధించిన సంచిక అందజేత.
జిల్లా ఎస్.పి డా. బి.బాలస్వామి ఐ.పి.ఎస్.
ఈ రోజు మెదక్ జిల్లా ఎస్.పి డా.బి.బాలస్వామి ఐ.పి.ఎస్.ఆదేశానుసారం మెదక్ డి.ఎస్.పి.డా.శ్రీ.రాజేష్ గారు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మే 13న పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించబడుతున్న సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఎన్నికల విధులను నిర్వహించబోతున్న పోలీస్ సిబ్బందికి మరియు కేంద్ర బలగాలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సిబ్బందికి పోలింగ్ స్టేషన్ల వద్ద, ఎన్నికల నిర్వహణ పట్ల, చేయవలసిన విధుల పట్ల, మొబైల్ పార్టీల నందు, పోలింగ్ సమయం పట్ల వివిధ అంశాలతో కూడిన పూర్తి అవగాహనను సిబ్బందికి అందించడం జరిగింది.
ఏ ఏ విధుల నందు సిబ్బంది చేయవలసిన సూచనలతో కూడిన ఒక సంచికను ప్రతి ఒక్క సిబ్బందికి అందజేయడం జరిగింది. సిబ్బందికి ఎటువంటి అనుమానాలు ఉన్న పుస్తకంలో చూసి నివృత్తి చేసుకోవాలని తెలియజేశారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సంఘం నిర్ణయించిన సమయం ప్రకారం మే 13 న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించబడుతుందని తెలియజేశారు. పోలింగ్ స్టేషన్ల వద్ద ప్రజలకు 100 మీటర్ల పరిధిలో గూమి కూడకుండా, ప్రజలు క్రమబద్ధీకరణతో క్యూలైన్లను పాటిస్తూ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చూడాలని సూచించారు. పోలింగ్ బూత్ లోపలికి మొబైల్ ఫోన్లను, మంట కలిగించే వస్తువులకు అనుమతి లేదని ప్రజలకు తెలియచేయాలని సూచించారు.
పోలింగ్ సెంటర్ లోపలికి ఓటర్ స్లిప్పు, ఐడి కార్డులు లాంటి వాటిని అనుమతించాలని సూచించారు. సిబ్బంది ఎండలు మండుతున్న నేపథ్యంలో ఓఆర్ఎస్ మరియు మంచినీటిని ఎక్కువ గా సేవించి తమ ఆరోగ్యాలని కాపాడుకోవాలని సూచించారు. ఎటువంటి అత్యవసర సమయంలోనైనా మీకు త్వరగా అందుబాటులో ఉండే రూట్ మొబైల్ పార్టీలను సంప్రదించాలని లేనిపక్షంలో స్ట్రైకింగ్ ఫోర్స్ మరియు స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అందుబాటులో ఉంటాయని తెలియజేశారు. ప్రతి ఒక్క సిబ్బంది వద్ద తాము నిర్వహించే పోలింగ్ స్టేషన్ పరిధిలో వచ్చే ఉన్నతాధికారుల మొబైల్ నెంబర్లను ముందుగానే తీసుకోవాలని సూచించారు. చివరగా పోలీసుల ముఖ్య బాధ్యత ఈవీఎంలను సురక్షితంగా కాపాడటం అని గుర్తు చేశారు.
దేశవ్యాప్తంగా జరిగిన సంఘటనలను సిబ్బందికి తెలియపరచి, అలాంటి సంఘటనలు పురాణావృతంగా చూడాలని తెలియజేశారు. రూట్ మొబైల్స్ నందు సిబ్బంది రిసెప్షన్ సెంటర్కు వచ్చేంతవరకు అప్రమత్తంగా ఉంటూ తమ విధులను పూర్తిగా నిర్వర్తించాలని సూచించారు. పోలింగ్ పూర్తి అయిన తరువాత స్ట్రాంగ్ రూముల వద్ద భద్రతలో కేంద్ర బలగాలను వినియోగించునున్నట్లు, భద్రతలో వారి బాధ్యత కీలకంగా ఉండబోతున్నట్లు తెలియజేశారు.