Reporter -Silver Rajesh Medak.
Date-10/05/2024.
పూల్లూరులో.. జన ప్రభంజనం..
సిద్దిపేట నియోజకవర్గంలో
నీలం మధు ఎన్నికల ప్రచారం..
ఇన్చార్జి పూజల హరికృష్ణ ఆధ్వర్యంలో రోడ్ షో,
కార్నర్ మీటింగ్
ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ తో కలిసి ప్రచారంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రివర్యులు కొండా సురేఖ
భారీగా తరలివచ్చిన జనం
చింతమడకకు చిల్లు పడింది..
కార్నర్ మీటింగ్ లో మంత్రి సురేఖ
సిద్దిపేట నియోజకవర్గం పూల్లూరు మండల కేంద్రంలో మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు చేపట్టిన ప్రచారానికి జన ప్రభంజనంగా కదలి వచ్చారు. పూల్లూరు మండల కేంద్రానికి రాష్ట్ర మంత్రివర్యులు కొండ సురేఖతో కలిసి చేరుకున్న ఎంపీ అభ్యర్థి నీలం మధుకు ఇన్చార్జి పూజల హరికృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. రోడ్ షోలో మంత్రి కొండా సురేఖతో కలిసి ఎంపీ అభ్యర్థి నీలం మధు అభివాదం చేస్తూ ప్రచారం నిర్వహించారు. రోడ్ షో ప్రచారానికి జనం భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో తాడూరి శ్రీనివాస్, గూడూరు శ్రీనివాస్ గౌడ్, గాడి పెళ్లి శ్రీనివాస్, గంప మహేందర్, కనకయ్య గౌడ్, రాములు, అంజయ్య, వెంకన్న, పుల్లూరు రాములు తదితరులు పాల్గొన్నారు.
చింతమడకకు చిల్లు పడింది..
మంత్రి కొండా సురేఖ..
మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్వగ్రామం చింతమడకకు చిల్లు పడిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి, మెదక్ పార్లమెంట్ ఇన్చార్జి కొండా సురేఖ అన్నారు. సిద్దిపేట మండలం పూల్లూరు కార్నర్ మీటింగ్ లో మంత్రి సురేఖ మాట్లాడుతూ.. చింతమడక గ్రామం నుంచి కాంగ్రెస్ లో చేరారంటేనే పార్టీపై అభిమానం, బీఆర్ఎస్ పై ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. వచ్చే సర్పంచ్ ఎన్నికలలో చింతమడకలో జెండా ఎగురవేసి, సర్పంచ్ ను గెలిపించుకునే కార్యక్రమం చేపడతామని ఆమె స్పష్టం చేశారు. ఇవాళ కెసిఆర్ బిజెపి వాళ్ళతో కుమ్మక్కై, కూతురు కవితను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఇక్కడి ప్రజానీకాన్ని వంద తన పెన్నుతో ఇబ్బంది పెట్టిన అభ్యర్థి వెంకటరామిరెడ్డిని ఓటు ద్వారా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. వంద హామీలు ఇచ్చిన రఘునందన్ రావు ఏ ఒక్క హామీను నెరవేర్చాడో? చూపాలని ఆమె ప్రశ్నించారు. కేంద్రంలో ఉన్న బిజెపి సర్కారు ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటుపరం ఇస్తోందని విమర్శించారు. వ్యవసాయం రంగంలోకి అడుగుపెట్టిన బిజెపి వ్యవసాయదారులకు వారి పంట పొలాల పైన హక్కులు లేకుండా చేసే ప్రయత్నాలు చేస్తోందని దుయ్యబట్టారు. బిజెపి, బీఆర్ఎస్ గత తొమ్మిది ఏళ్లలో చేయని పనులను రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే 5 గ్యారెంటీలను అమ్మలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే పేదల బతుకులు బాగుపడతాయన్నారు. స్వర్గీయ ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించినటువంటి ఎంపీ స్థానం నుంచి యువనేత నీలం మధుకు అవకాశం వచ్చిందని, పేదింటి బిడ్డ నీలం మధును ఆశీర్వదించి పార్లమెంటు పంపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
యువతను మోసగించాయి..
ఎంపీ అభ్యర్థి నీలం మధు
గత పదేళ్లు అధికారంలో ఉన్న బిజెపి, బీఆర్ఎస్ పాలకులు పేదలకు చేసింది ఏమీ లేదని మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. పూల్లూరు కార్నర్ మీటింగ్ లో నీలం మధు ప్రసంగించారు. యువతకు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని నమ్మ పలికిన కేంద్ర సర్కారు వాటిని భర్తీ చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ ఈ తరహాలో యువతను నమ్మించి మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 30 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇకపోతే ఈ పార్లమెంటు ఎన్నికలలో ముందుకు వస్తున్న ఆయా పార్టీల నేతలను ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుందని, తద్వారా పేద వర్గాలకు మేలు జరగనుందన్నారు. స్వర్గీయ ఇందిరా గాంధీ పోటీ చేసిన గడ్డపై నుంచి తనకు అవకాశం వచ్చిందని, ఎంపీ అభ్యర్థిగా తనను గెలిపిస్తే నియోజకవర్గానికి అందుబాటులో ఉండి సేవ చేస్తానని నీలం మధు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.