సిపిఎం, సిపిఐ పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కోరిక బలరాం నాయక్ గారి గెలుపే లక్ష్యంగా మిత్రపక్షాల ఆధ్వర్యంలో భద్రాచల పట్టణ కేంద్రంలో బైక్ ర్యాలీ….
కాంగ్రెస్ పార్టీ జెండాను ఊపి ర్యాలీని ప్రారంభించిన భద్రాచల శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకటరావుగారు….
బైక్ ర్యాలీలో పాల్గొన్న ఎన్.ఎస్.యు.ఐ,ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, మైనార్టీ సెల్, ఎలక్ట్రిషన్ యూనియన్ నాయకులు…..
ఈరోజు భద్రాచల పట్టణ కేంద్రంలో సిపిఎం, సిపిఐ పార్టీలు బలపరుస్తున్న మహబూబాబాద్ పార్లమెంటు అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గారి విజయాన్ని కోరుకుంటూ 500 బైక్ లతో పట్టణంలోనీ ప్రతి కాలనీలో ర్యాలీని నిర్వహించడం జరిగింది.
మాజీ గ్రంథాలయ చైర్మన్ భోగాల శ్రీనివాస్ రెడ్డి గారి నేత్రంతోల్లో జరుగుతున్నటువంటి ఈ బైక్ ర్యాలీని భద్రాచల శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు కాంగ్రెస్ పార్టీ జెండాను ఊపి ప్రారంభించడం జరిగింది.
స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ బైక్ ర్యాలీలో ఎన్.ఎస్.యు.ఐ, ఎస్సీ సెల్,ఎస్టీ సెల్, మైనార్టీ సెల్, ఎలక్ట్రిషన్ యూనియన్ ల ఆధ్వర్యంలో యువత భారీ సంఖ్యలో పాల్గొని, బలరాం నాయక్ గారి గెలుపు, భద్రాచలం అభివృద్ధికి మలుపు, చదువుకున్నావు యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అనే నినాదంతో భద్రాచలం పురవీధులలో నినాదాలు చేస్తూ, పట్టణంలోని ప్రతి ప్రాంతంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.
ఈ యొక్క బైక్ ర్యాలీలో టిపిసిసి సభ్యులు బుడగం శ్రీనివాస్, పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జ్ నున్నే రామకృష్ణ, తోటకూర రవిశంకర్, భద్రాచలం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సరెళ్ళ నరేష్, సిపిఎం నాయకులు వెంకట్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండశెట్టి కృష్ణమూర్తి,అరికెల తిరుపతిరావు గారు,రత్నం రమాకాంత్ ,తాళ్లపల్లి రమేష్ గౌడ్, ఎన్ ఎస్ యు ఐ నియోజకవర్గ అధ్యక్షులు సరెళ్ళ వెంకటేష్,బంబోతుల రాజీవ్,ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు రాసముల రాము,తాండ్ర నరసింహారావు, నర్రా రాము,నాగేంద్ర, రాగం సుధాకర్,గండేపల్లి హనుమంతరావు,దుద్దుకూరు సాయిబాబా,యూత్ నాయకులు గాడీ విజయ్,ఆకుల వెంకటరమణ,భాను, మహిళా కాంగ్రెస్ నాయకులు రూపా దేవి తదితరులు పాల్గొన్నారు.