పోలింగ్ సామగ్రి కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ .

Reporter -Silver Rajesh Medak.

తేదీ 10-5-2024
మెదక్

పోలింగ్ సామగ్రి కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ .

సాధారణ ఎన్నికలు 2024 ఎన్నికల నియమావళి అమలులో భాగంగా శుక్రవారం స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మెదక్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ సామాగ్రి కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాలకు సామాగ్రిని సరిచూసుకొని పంపిణీ చేయాలన్నారు.
పోలింగ్ సామాగ్రి, పోలింగ్ పత్రాలు,ఇంకు ,పెన్నులు రికార్డులు, మ్యాపులు సరిచూసుకొని పంపిణీ చేయాలన్నారు.
పోలింగు కు ఒకరోజు ముందు పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్ఓ, ఆర్డిఓ రమాదేవి, మెదక్ తాహాసిల్దార్ శ్రీనివాస్, హవేలీ ఘనపూర్ తహసిల్దార్ నారాయణ, పోలింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!