కాంగ్రెస్ లో చేరిన కాసుల రాము గౌడ్
దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి గెలుపు తథ్యం అని చేవెళ్ల మండలం కేసారం గ్రామానికి చెందిన నాయకులు పి మల్లారెడ్డి, K రాజిరెడ్డి, P కాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాసుల రాము గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మండల నాయకులు సోలిపురం బల్వంత్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు బండారి ఆగి రెడ్డి, PACS చైర్మన్ దేవర వెంకటరెడ్డి,మర్పల్లి కృష్ణారెడ్డి, సమక్షంలో చేవెళ్ల పార్లమెంటు అభ్యర్థి డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి గారు బుధవారం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీతోనే పేదలకు న్యాయం జరుగుతుందని, దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు అత్యధిక సీట్లు గెలవడం ఖాయమన్నారు.రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేసారం సర్పంచ్ కాసుల రమేష్ గౌడ్,కాసుల ప్రవీణ్ గౌడ్,బక్కని ఆంజనేయులు, కావ్యగూడెం గోపాల్ రెడ్డి,కాసుల శివరాజ్ గౌడ్ , జైన భాస్కర్ రెడ్డి, భీమనపల్లి గణేష్, కాసుల శ్రీశైలం గౌడ్, భీమనపల్లి రాఘవేందర్, కలీెంల వీరయ్య, కటికం పోచయ్య, ఉషగొని సుధాకర్, కటకం శివశంకర్, వంశరాజు రాములు, ఉష గొని అనిల్, దీపక్ రెడ్డి, సుమన్, హరికృష్ణ, పృద్వి, అంజన్ గౌడ్, దివాకర్ గౌడ్, భరత్ రెడ్డి, శివకుమార్, అశోక్, భరత్ గౌడ్, రాకేష్ గౌడ్, సాయి, మరియు కేసారం గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.