మంత్రి సీతక్క గారి ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షులు అశోక్ గారి సూచనల మేరకు గోవిందరావుపేట మండల కేంద్రంలోని మొదటి వార్డు నందు పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన మండల ఇంఛార్జి మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు రేగ కళ్యాణి గారు…
రాహుల్ గాంధీ గారు ప్రధాని అవడమే లక్ష్యంగా, మహాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ గారి గెలుపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం..
రాహుల్ గాంధీ ప్రధాని అవ్వడం కాయం…
మత తత్వ బీజేపీ పార్టీని ఓడించి మానవత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం…
బలరాంనాయక్ గారు మంచి మనసున్న వ్యక్తి అని, అతను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే మనకు ప్రధాన రహదారులు, మోడల్ స్కూళ్లు, కస్తూర్బా స్కూళ్లు, వంతెనలు నిర్మించడం జరిగింది..
కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో పేదరిక నిర్మూలన కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ఆవిష్కరించింది…
రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ద్వారా ప్రతి ప్రాంతంలోని సమస్యలు తెలుసుకున్నారని, ప్రతి సమస్య మీద అవగాహన ఉన్న వ్యక్తి రాహుల్ గాంధీ గారని అన్నారు…
ప్రజలందరూ హస్తం గుర్తుకు ఓటు వేసి పోరిక బలరాంనాయక్ గారిని భారీ మెజారిటీతో గెలిపించి రాహుల్ గాంధీ గారికి మద్దతుగా పార్లమెంట్ పంపించాలని కోరారు…
ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరుతూ ప్రచారం నిర్వహించిన రేగ కళ్యాణి గారు…
తేది: 09.05.2024 గురువారం అనగా ఈరోజున గోవిందరావుపేట మండల కేంద్రంలోని మొదటి వార్డు నందు మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ గారి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించగా అట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల ఇంఛార్జి మరియు మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు రేగ కళ్యాణి గారు విచ్చేసి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి మహబూబ్ బాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భముగా కళ్యాణి గారు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ప్రతి గడప గడపకు తిరుగుతూ ప్రజలకు గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాల గురించి చెబుతూ బలరాంనాయక్ గారు చేసిన మంచి పనుల గురించి ప్రజలకు తెలియజేస్తూ హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రతి ఒక్కరినీ కోరారు. అలాగే రాహుల్ గారి కుటుంబం త్యాగాల కుటుంబం అని, ప్రధాని అయ్యే అవకాశం ఉన్న కూడా ప్రధానమంత్రి పదవిని తృణపాయంగా వదిలిపెట్టిన నిరాడంబరుడు అని అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడే ఇందిరమ్మ ఇండ్లు, రైతు రుణమాఫీ, ఇందిరా జల ప్రభ ద్వారా బోర్లు, రాజీవ్ ఆరోగ్య శ్రీ, 108, 104 అత్యవసర సేవలు, పంట రుణాలు, సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, ఉచిత విద్యుత్, ఉపాధి హామీ పథకం, అటవీ హక్కుల చట్టం, ప్రాజెక్టులు, వంతెనలు, ఆనకట్టలు, పంచవర్ష ప్రణాళికలు, ఆర్థిక ప్రణాళికలు, భారీ, మధ్య మరియు చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి లాంటి ఎన్నో పథకాలతో పేదరిక నిర్మూలనా చేసింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గరి నుండి ఒక్కరికీ కూడా ఒక ఇల్లు ఇచ్చిన దాఖలా లేదు అని, తెలంగాణ రాష్ట్రానికి ఒరగబెట్టిందేమి లేదు బీజేపీ పార్టీ అని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక నల్ల ధనాన్ని బయటకి తీసి జన్ ధన్ ఖాతాలో పేదలకు 15 లక్షల రూపాయలు వేస్తానని పదిహేను పైసలు కూడా ఇవ్వలేదని, ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసిందని, సామాన్యుడు బ్రతలేని స్థాయికి తీసుకువచ్చిందని, నిత్యావసర సరుకుల ధరలు, క్రూడాయిల్ ధరలు కూడా భారీగా పెంచి ప్రతి పేదవాడికి భారంగా మారిందని అన్నారు. జీఎస్టీ ద్వారా సామాన్యుడి నడ్డి విరిచి, మానవత్వాన్ని మంట కలుపుతూ మత విద్వేషాలను రెచ్చగొడుతుంది అని అన్నారు.
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే
- రైతు భరోసా పథకం
- పంటల కనీసం మద్దతు ధరకు చట్టబద్ధత
- వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ ఎత్తివేత
- రైతుల కోసం శాశ్వత రుణమాఫీ కమీషన్ ఏర్పాటు
- పంట బీమా సొమ్ము 30 రోజుల్లో నేరుగా రైతు ఖాతాల్లో జమ
- రైతులకు న్యాయం జరిగేలా కొత్త ఎగుమతి దిగుమతి విధానం
- మహిళలకు కాంగ్రెస్ ధీమా
- పేద వర్గాల మహిళలకు వార్షికంగా లక్ష రూపాయల సాయం
- అంగన్వాడీ కార్యకర్తల నెల వేతనానికి కేంద్ర ప్రభుత్వ సహకారం
- పంచాయితీల్లో మహిళలకు న్యాయ సహాయం
- అన్ని జిల్లా కేంద్రాల్లో శ్రామిక మహిళలకు హాస్టల్ వసతులు ఏర్పాటు
- యువతకు కాంగ్రెస్ గ్యారంటీలు
- దేశ వ్యాప్తంగా 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ
- అప్రెంటిస్ షిప్ హక్కు చట్టం ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ
- ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో ఉపాధి లభించేలా చర్యలు
- అప్రెంటిస్ కాలంలో యువతకు లక్ష గౌరవ భృతి
- ప్రశ్న పత్రాల లీకేజీలను అరికట్టేందుకు కఠినమైన చట్టం
- సామాజిక ఆర్థిక కులగణన
- రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లపై 50 శాతం కోటా పరిమితి ఎత్తివేత
- జనాభాకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీలకు బడ్జెట్ కేటాయింపు
- ఏడాదిలోగా అటవీ హక్కుల చట్టం కింద ఉన్న వివాదాల పరిష్కారం
- ఎస్టీలు అధికంగా ఉన్న ప్రాంతాలను షెడ్యూల్డ్ ఏరియాలుగా నోటిఫై
- శ్రామిక్ న్యాయ్
- కార్మికులకు సంపూర్ణ ఆరోగ్య హక్కుకు చట్టం. ఇందులో ఉచితంగా పరీక్షలు, మందులు, చికిత్స, సర్జరీలు, అవసాన దశలో సంరక్షణ
- ఉపాధి హామీ కూలీలతో సహా అందరికీ రోజుకు కనీసం 400 రూపాయల వేతన గ్యారంటీ. పట్టణ ప్రాంతాల్లో ఉపాధికి గ్యారంటీ
- అసంఘటిత రంగ కార్మికులకు జీవిత భీమా, ప్రమాద భీమా
- కీలక ప్రభుత్వరంగ సంస్థల్లో కాంట్రాక్టు ఉద్యోగాలకు స్వస్తి చెప్పి శాశ్వత ఉద్యోగ భద్రత. బాగీదారీ న్యాయ్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం, రాజీవ్ ఆరోగ్య శ్రీ ద్వారా 10 లక్షల వరకు ఉచిత వైద్యం, ప్రతి నియోజకవర్గానికి మొదట విడతగా 3500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరిగిందని, అలాగే ఆగస్టు 15 వరకు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని కావున ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి పోరిక బలరాంనాయక్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు, ప్రజా ప్రతినిధులు, యూత్ నాయకులు, మహిళా నాయకురాలు, అభిమానులు తదితర నాయకులు పాల్గొన్నారు.