Reporter -Silver Rajesh Medak.
Date- 08.05.2024.
ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ చాల కీలకమైనది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలి
చట్టం ముందు అందరూ సమానులే ప్రత్యేక మినహాయింపులు ఎవరికీ ఉండవు.జిల్లా ఎస్.పి డా.బి.బాలస్వామి ఐ.పి.ఎస్.
ఈ రోజు మెదక్ జిల్లా ఎస్.పి డా.బి.బాలస్వామి ఐ.పి.ఎస్. గారు లోక్ సభ ఎన్నికల నేపద్యంలో జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి డా.బి.బాలస్వామి ఐ.పి.ఎస్. మాట్లాడుతూ….. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ చాల కీలకమైనదని, ఎవరైనా వ్యతిరేఖ చర్యలకు పాల్పడితే పోలీస్ పరంగా చాల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. చట్టం ముందు అందరూ సమానమే. ప్రత్యేక మినహాయింపులు ఎవరికీ ఉండవన్నారు. అలాగే భారత ఎలక్షన్ కమిషన్ చే జారీ చేయబడిన నియమాల ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉందని, ఈ నియమావళి ప్రతి ఒక్కరికి వర్తిస్తుందని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే లేదా ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమించే వారిని గుర్తించి వెంటనే వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు కార్యకర్తలు భారత ఎలక్షన్ కమిషన్ నియమాల ప్రకారం నడుచుకోవాలని అన్నారు. పోలింగ్ రోజు మాత్రమే అప్రమత్తంగా ఉండడం కాకుండా, ప్రిపోలింగ్ లో భాగంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట ప్రణాళికతో ముందుకు సాగుతున్నామన్నారు.అలాగే పోలీస్ సిబ్బంది చేయాల్సిన మరియు చేయకూడని పనులను గురించి తెలియజేయడం జరిగింది ఎన్నికల ప్రక్రియ పట్ల సామాన్య ప్రజల్లో నమ్మకం కలిగించడంలో ముఖ్యమైన పాత్రని పోలీసులు వహించాల్సి ఉంటుందని ఎన్నికల ప్రచారం శాంతియుతంగా న్యాయబద్ధంగా జరిగేటట్లు హింసాత్మక సంఘటనలు జరగకుండా చూడాల్సిన అనితర బాద్యత పోలీసు శాఖ పై ఉంటుందని జిల్లాలో ఫ్రీ అండ్ ఫేర్ గా ఎన్నికలు జరిగేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో పని చేయాలని అన్నారు. పోలీస్ స్టేషన్ ల పరిదిలో ఎన్నికలకు సంభందించి గ్రామాలలో జరిగే ప్రతి విషయం పోలీసులకు తెలిసి ఉండాలని అన్నారు. నగదు, మద్యంపై ఉచిత పంపిణీలపై ప్రత్యేక నిఘా ఉంచాలని అన్నారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎన్ఫోర్స్మెంట్ వర్క్ పకడ్బందీగా చేపట్టాలని, ఎవరైనా ఓటర్లను ప్రలోభపెట్టి ఏలాంటి చర్యలకు దిగిన సంబంధిత వ్యక్తులపై MCC వాయిలేషన్ కేసులు నమోదు చేయాలని అన్నారు. అలాగే డ్యూటీకి సక్రమమైన యూనిఫాంలో సరైన సమయంలో రావాలని అందరితో మర్యాదగా ప్రవర్తించాలని, ఎన్నికలు సాధారణంగా ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం 5 గంటలకు జరుగుతాయని కానీ ఈసారి సాయంత్రం 06:00 గంటల వరకు ఉంటుందని ఈ విషయాన్ని గమనించాలని కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుజామున ఓటర్ లు రావడం జరుగుతుంది. పోలీస్ వారు కూడా అంతకు ముందు రోజే ఎన్నికలు జరగబోతున్న ప్రాంతానికి చేరుకోవాలి ఆ ప్రాంత వాతావరణాలను ముందుగానే గమనించి అసాంఘిక సంఘటనలు జరిగే సూచనలు ఉంటే వెంటనే తమ పై అధికారులకు ముందుగానే తెలిజెయాలి సంబందిత పై అధికారుల ఫోన్ నంబర్లు తమ వద్ద ఉండాలని ఎన్నికల రోజున తన డ్యూటీ పాస్పోర్ట్ ద్వారా ఇవ్వబడిన విధుల్ని సరిగా అర్థం చేసుకుని వాటిని మాత్రమే అనుసరించాలి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్.పి.అడ్మిన్.ఎస్.మహేందర్ , మెదక్ డి.ఎస్.పి.డా.శ్రీ.రాజేష్ గారు, తూప్రాన్ డి.ఎస్.పి.శ్రీ.వెంకట్ రెడ్డి గారు, ఏ.ఆర్.డి.ఎస్.పి.రంగా నాయక్ ,డి.సి.ఆర్.బి సిఐ .మధుసూదన్ గౌడ్ ఎస్.బి సిఐ .సందీప్ రెడ్డి, యం.టి.ఆర్.ఐ
నాగేశ్వర్ రావ్ , జిల్లా సి.ఐ లు,ఎస్.ఐ. లు సిబ్బంది పాల్గొన్నారు.