రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) మే 8:- ఆపద సమయంలో రక్త,అవయ దానములు, అవసరమున్న వారికి ప్రాణ దానములని, నేడు ప్రపంచవ్యాప్తంగా రెడ్ క్రాస్ సంస్థ వీటిపై అవగహన కల్పించి,విస్తృత సేవలు అందిస్తున్నాయని, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ శాఖ చైర్మన్ లయన్ డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అంతర్జాతీయ రెడ్ క్రాస్ సంస్థ స్థాపకుడు శ్రీ జీన్ హెన్రీ డొనంట్ జన్మదినోత్సవం పురస్కరించుకొని మెదక్ జిల్లా అక్కన్నపేట్, ఝాన్సీలింగపూర్ గ్రామ పంచాయతీలలో, మెడిసిటీ హాస్పిటల్ , మేడ్చల్ వారి ఆధ్వర్యంలోడాక్టర్ల బృందం, ఆరోగ్య శిబిరములను నిర్వహిచి,ప్రజలకు వివిధ పరీక్షలు నిర్వహించడం జరిగింది. రెడ్ క్రాస్,మెదక్ శాఖ నిర్వహించిన మెగా హెల్త్ క్యాంపులను పురస్కరించుకొని, జీన్ హెన్రీ డూనంట్ గారి సేవలను గుర్తు చేసుకొని, జన్మదినం సందర్భముగా ఘనంగా నివాళులను అర్పించారు. ఈ ఆరోగ్య శిబిరంలో అక్కన్నపేట్ లో 160 రోగులను పరీక్షించి, ,ఝాన్సీ లింగపూర్ లో 124 మందిని పరీక్షించి, ఉచితముగా మందులను పంపినిచేసిందని,వివిధ ఆపరేషన్స్ కి ఎంపిక చేయబడిన వారికి మెడిసిటీ,మేడ్చల్ ఆసుపత్రి కి 14 న రవాణా చేసి వివిధ ఓపెరషన్ల ను నిర్వహిస్తామని బాద్యులు సంజయ్,కుమారస్వామిలు తెలిపారు. అలాగే రెడ్ క్రాస్ చైర్మన్ తో సహా మేనేజ్మెంట్
సభ్యులు వైద్య శిబిరములను పర్యవేక్షించారు.ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ మేనేజ్మెంట్ సభ్యులు పి.లక్ష్మణ్ యాదవ్,వి.దామోదర్ రావు,దేమే యాదగిరి,డి.జి.శ్రీనివాస శర్మ,టి.సుభాష్ చంద్ర బోస్,వంగరి కైలాసం, మద్దెల సత్యనారాయణ,మద్దెల రమేష్, డా.గోవింద్, హన్మకొండ శ్రీకాంత్ శర్మ,బి.లక్ష్మీ నర్సయ్య, దారం రమేష్,రాములు సార్,కరణం రవి గణేష్ కుమార్, వి సతీష్ రావు లు,వేణు,గ్రామ పెద్దలు మనేగాళ్ల రామకిష్టయ్య, జంగం సిద్దిరాములు , ప్రబాకర్ పోలిస్ దేవేందర్ , వార్డుసభ్యులు, గ్రామ వైద్య శిబిరంను విజయవంతం చేసి పాల్గొన్నారు.