గడప గడపకు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు
మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయ పేట గ్రామంలో నిన్నటి రోజు ఇంటింటికి ప్రచారం చేస్తున్న స్థానిక సర్పంచ్ బుడ్డ స్వర్ణలతభాగ్యరాజ్, మరియు గ్రామ అధ్యక్షుడు మొజంబిల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కలిసి మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మదుకు మద్దతుగా ప్రచారం రాష్ట్రంలో పదేళ్లు విధ్వంసం సృష్టించిన కేసీఆర్‌కు ఇటీవల శాసనసభ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు బుడ్డ భాగ్యరాజ్ విమర్శించారు. ఓటమి తర్వాతనైనా కేసీఆర్‌లో మార్పువస్తుందని, రైతులకు క్షమాపణ చెప్పి ఓట్లు అడుగుతారని ఆశించామని కానీ, ఆయనలో మార్పు రాలేదని దుయ్యబట్టారు. సరికదా, ఈ ప్రభుత్వం పడిపోతుందంటున్నారని మండిపడ్డారు.ఈక్రమంలోనే కేంద్ర సర్కార్‌పై స్థానిక సర్పంచ్ బుడ్డ స్వర్ణలతభాగ్యరాజ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. *తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులను మోదీ గుజరాత్‌కు తరలించారని ఆరోపించారు. ఆయన గుజరాత్‌కు మాత్రమే ప్రధానా? దేశం మొత్తానికా? అని నిలదీశారు. ఈ పదేళ్లలో తెలంగాణకు మోదీ గాడిదగుడ్డు మాత్రమే ఇచ్చారని మెదక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బుడ్డ భాగ్యరాజ్ విమర్శించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాణిక్యరెడ్డి,సిద్దిరాములు,డప్పు కుమార్,ఆకులస్వామి,నాగరాజ్, కొత్తగొల్లరాజు,సాకలస్వామి. దండు మహేష్ తదితరులు పాల్గొన్నారు.