ములుగు పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన బూత్ ఇంఛార్జిల సమావేశంలో పాల్గొన్న ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ గారు…

పోరిక బలరాంనాయక్ గారిని గెలిపించడమే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త పని చేయాలి…

కాంగ్రెస్ పార్టీ పథకాలు ప్రతి ఇంటికి చేరే విధంగా కార్యకర్తలు అందరూ గడప గడపకి ప్రచారం నిర్వహించాలి…

ములుగు పట్టణ కేంద్రంలో బలరాంనాయక్ గారికి భారీ మెజారిటీ అందించేలా అందరూ సమన్వయంతో పని చేయాలి…

గతంలో బలరాంనాయక్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు చేసిన పనులను ప్రజలందరికీ తెలియజేయాలి…

మోడల్ స్కూళ్లు, కస్తూర్బా స్కూళ్లు, వంతెనలు, ప్రధాన రహదారులు ములుగు జిల్లాకు తెచ్చిన ఘనత బలరాంనాయక్ గారిదే…

తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారికి పార్లమెంట్ సీట్ గెలిపించి కానుకగా ఇద్దాం..

రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడమే మన లక్ష్యం…

కాంగ్రెస్ పార్టీ అంటేనే త్యాగాల పార్టీ…

దేశానికి స్వాతంత్య్రం అయిన, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అయిన సిద్దించింది అంటే కాంగ్రెస్ పార్టీ చలవే…

మత విద్వేషాలను రెచ్చగొట్టడమే బీజేపీ పార్టీ ప్రధాన అజెండా…

ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టి, అదాని, అంబానీ లాంటి వ్యక్తులకు దోచిపెడుతుంది బీజేపీ పార్టీ..

ప్రతి గ్రామంలో రాముడి మందిరాన్ని, విద్యాలయాన్ని నిర్మించింది కాంగ్రెస్ పార్టీ…

గత పడేండ్లలో తెలంగాణ ప్రజల పేదరిక నిర్మూలన కొరకు బీజేపీ ప్రవేశ పెట్టిన పథకాలు ఒక్కటి కూడా లేవు..

పదేండ్ల పాలనలో రైతు రుణమాఫీ చేయకుండా, బ్యాంకులను కొల్లగొట్టి ఇతర దేశాలకు పరారైన కార్పొరేట్ వ్యక్తుల వ్యక్తి గత రుణాలను మాఫీ చేసి దేశ ప్రజలను మోసం చేస్తుంది బీజేపీ ప్రభుత్వం…

నిజమైన అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం..

ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరిన పైడాకుల అశోక్ గారు…

తేది: 08.05.2024 బుధవారం అనగా ఈరోజున ములుగు జిల్లా కేంద్రంలో ములుగు పట్టణ అధ్యక్షులు చింతనిప్పుల బిక్షపతి ఆధ్వర్యంలో ములుగు పట్టణ బూత్ ఇంఛార్జిల సమావేశాన్ని ఏర్పాటు చేయగా అట్టి సమావేశానికి ముఖ్య అతిథిగా ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ గారు విచ్చేసి మత విద్వేషాలను రెచ్చగొట్టి మారణహోమాన్ని సృష్టిస్తున్న బీజేపీ పార్టీని ఓడించి, మానవతా దృక్పథంతో, సమనత్వంతో ముందుకు పోతున్న కాంగ్రెస్ పార్టీని గెలిపించి, రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలని, అందుకు ప్రజలందరూ పదమూడవ తారీఖున జరిగే పార్లమెంట్ ఎన్నికల బ్యాలెట్ పైన ఉన్న నాలుగవ నెంబర్ హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.

ఈ సందర్భముగా అశోక్ గారు మాట్లాడుతూ బ్రిటిష్ మూకల నుండి ప్రాణాలని ఫణంగా పెట్టీ భారతదేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, భరతమాత సంకెళ్లు తెంచిన ఘనత కాంగ్రెస్ పార్టీది అన్నారు. ఎంతో చారిత్రాత్మకమైన కాంగ్రెస్ పార్టీ చరిత్ర గురించి కార్యకర్తలు అందరూ గడప, గడపకి తిరుగుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తె వచ్చే పథకాల గురించి ప్రతి ఒక్కరికీ తెలియజేస్తూ ప్రచారం నిర్వహించాలని కోరారు. బలరాం నాయక్ గారిని మహాబాద్ ఎంపీగా గేలిపించడానికి ప్రతి ఒక్కరూ   సమన్వయంతో పని చేస్తూ, అత్యధిక మెజారిటీతో గెలిపించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. బలరాంనాయక్ గారు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పని చేసినప్పుడు ములుగు జిల్లాకు మోడల్ స్కూళ్లు, కస్తూర్బా స్కూళ్లు, ముళ్ళకట్టె వంతెనలు, ప్రధాన రహదారులు తీసుకుని వచ్చి అడవి ప్రాంతాలను అభివృద్ధి చేశారని అన్నారు. సీతక్క గారు తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ములుగు నియోజకవర్గానికి ఎన్నో అంతర్గత సీసీ రోడ్లు ఇస్తున్నారని, కమ్యూనిటీ హాల్స్ కట్టిస్తున్నారని, వచ్చే అయిదేండ్లలో ములుగు నియోజకవర్గం చాలా అభివృద్ధి చెందుతుందని అన్నారు. సీతక్క గారు మంత్రి అయిన మూడు నెలల్లోనే ములుగు జిల్లాలోని ప్రతి మండలానికి సుమారుగా మూడు కోట్ల రూపాయలతో అంతర్గత సీసీ రోడ్లు వేయించారని అన్నారు. సీతక్క గారి లాంటి నాయకురాలికి తోడుగా బలరాంనాయక్ గారి నాయకుడ్ని గెలిపిస్తే ములుగు ఇంకా అభివృద్ధి చెందుతుందని కావున ప్రతి ఒక్క కార్యకర్త కాంగ్రెస్ పార్టీ గొప్పతనాన్ని చాటి చెపుతూ ప్రచారం చేసి అధిక మెజారిటీ అందించాలని కోరారు. మహిళలకు పెద్ద పీట వేస్తున్న కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో కూడా గెలిపిస్తే ప్రతి మహిళకు సంవత్సరానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తుంది అని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మకు పార్లమెంట్ సీట్లు గెలిచి కానుకగా ఇవ్వాలి అని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తె కేంద్రం నిధులతో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని, ఇండ్ల స్థలాలు లేని వారికి స్థలాలు కేటాయిస్తామని, మహిళా సంఘాలను ఇంకా అభివృద్ధి చేసి ప్రతి ఒక్క మహిళ ఆర్థికంగా స్థిరపడేలా పథకాలు ఆవిష్కరిస్తాం అని అన్నారు. కావున తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదించి, బలరాం నాయక్ గారి బ్యాలెట్ నమునపై ఉన్న నాలుగవ నెంబర్ హస్తం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

 ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు మరియు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లాది రాంరెడ్డి, మండల ఇంఛార్జి మరియు యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవిచందర్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, ఓబీసీ సెల్ పార్లమెంట్ ఇంఛార్జి మరియు జిల్లా అధ్యక్షులు వంగ రవి యాదవ్, మండల అధ్యక్షులు ఎండి. చాంద్ పాషా, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లెల్ల భరత్ తదితర ములుగు పట్టణ నాయకులు అందరూ పాల్గొన్నారు.
Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!