Reporter -Silver Rajesh Medak.
Date-04/05/2024.
బిజెపి గెలిస్తే…దేశాన్ని అమ్మేస్తారు..
రాష్ట్ర అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి, మెదక్ ఇన్చార్జి కొండా సురేఖ
మెదక్ లో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం
హాజరైన మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్, మల్కాజ్గిరి* మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, డిసిసి అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ , ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ,
బిజెపి అధికారంలోకి వస్తే దేశాన్ని అమ్మడం ఖాయమని రాష్ట్ర అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి, మెదక్ ఇన్చార్జి కొండా సురేఖ అన్నారు. ఇప్పటికే ప్రైవేటీకరణ ప్రోత్సహిస్తున్న ప్రధాని మోదీ ఈ ఎన్నికలలో మతం పేరుతో మన ముందుకు వస్తున్నారని తెలిపారు. దేశాభివృద్ధి, పేదల గురించి బిజెపి సర్కారు ఏనాడు ఆలోచించింది లేదన్నారు. ఇలాంటి తరుణంలో ఈ ఎన్నికలలో బీఆర్ఎస్, బిజెపి పార్టీలకు ఎందుకు ఓటు వేయకూడదో ? అన్న విషయాలను గడప గడపకు తీసుకెళ్లి ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని కార్యకర్తలకు సూచించారు. శనివారం శ్రీవెంకటేశ్వర గార్డెన్స్ లో మెదక్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం గూడూరు ఆంజనేయులు గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి మంత్రివర్యులు కొండా సురేఖ, ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్, మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్, మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, డిసిసి అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు కొండా సురేఖ మాట్లాడుతూ.. పదేళ్లుగా బిజెపి, టిఆర్ఎస్ పాలకులు చేసింది ఏమీ లేదని విమర్శించారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఒక్క రూపాయి పని చేశాడో ప్రశ్నించాలని చూపాలని కార్యకర్తలకు సూచించారు. బిజెపిలో ఓడిపోయిన వారికే ఎంపీ టికెట్లు ఇచ్చారని, ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తులకు ఎంపీగా పనిచేస్తారా? అని ప్రశ్నించారు. ఆయా విషయాలన్నింటి ప్రతి ఇంటికి తీసుకెళ్లి ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. స్వర్గీయ ప్రధాని ఇందిరాగాంధీ మెదక్ ప్రాంతానికి ఎన్నో పరిశ్రమలను తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో అమలవుతున్న గ్యారెంటీ పథకాలతో పేద వర్గాల అందరికీ మేలు జరిగిందన్నారు. మత రాజకీయాలతో మన ముందుకు వస్తున్న బిజెపిని గనుక గెలిపిస్తే ఈసారి దేశాన్ని అమ్ముకుంటారని దుయ్యబట్టారు. ఇందిరమ్మ రాజ్యం కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. అలాగే బీసీ బిడ్డ అయిన నీలం మధును గెలిపించి పార్లమెంటుకు పంపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
ఇందిరమ్మ రాజ్యం రావాలి..ఎంపీ అభ్యర్థి నీలం మధు
ఈ దేశంలో రాజ్యాంగాన్ని కాపాడుకునే రోజులొచ్చాయని ఎంపీ అభ్యర్థి నీలం మధు అన్నారు. గతంలో ఇందిరమ్మ ఇళ్లు, భూములు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. ఇచ్చిన భూములను బీఆర్ఎస్ గుంజుకున్నది. ఈ పార్లమెంట్ ఎన్నికలలో ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. తనను ఎంపీగా గెలిపిస్తే, నియోజకవర్గానికి అందుబాటులో ఉంటానని తెలిపారు. అలాగే టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటుచేసి పార్లమెంటు పరిధిలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
నీలం మధును గెలిపించుకోవాలి మైనంపల్లి హనుమంతరావు
ఎంపీ అభ్యర్థి బీసీ యువ నేత నీలం మధును గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ను చింతమడకకు, హరీష్ రావు ను తోటపల్లికి, కేటీఆర్ ను అమెరికాకు పంపడమే లక్ష్యంగా ముందుకు వెళ్తానని తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, ఎంపీపీ పండరి గౌడ్, చౌదరి శ్రీనివాస్, గోవింద నాయక్, ప్రశాంత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, కౌన్సిలర్లు లింగం, జీవన్, నాయకులు గంగారెడ్డి గంగారెడ్డి, మధు, రమేష్ రెడ్డి, హైమద్, మహేందర్ రెడ్డి, అరుణ, సులోచన, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.