ధర్మారం గ్రామంలో భారతీయ జనతా పార్టీలోకి 60 మంది యువకులు చేరిక

రామాయంపేట (స్టూడియో 10 టీవీ ప్రతినిధి) మే 4:- మెదక్ జిల్లా నిజాంపేట జెడ్పిటిసి భారతీయ జనతా పార్టీ మెదక్ నియోజక వర్గ ఇన్చార్జి పంజ విజయ్ కుమార్ అధ్వర్యంలో శనివారం నాడు రామాయంపేట మండలం ధర్మారం గ్రామంలో 60 మంది యువకులు బిజెపిలోకి చేరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారు భారత దేశ కీర్తి ప్రతిష్టలు పెంచటంతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన, మోదీ గారు అయోధ్య రామ మందిర నిర్మాణం హిందువుల చిరకాల స్వప్నం నెరవేరింది.10 ఏళ్లు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం ఆగం చేసి కేసిఆర్ కుటుంబం ప్రజలను మోసం చేసిందన్నారు. అబద్ధపు హామీలు ప్రచారాలతో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించిన కుటుంబ రాజకీయాలను పూర్తిగా అంతం చేయాలనీ నీతి వంతమైన, నిజాయితీ,పరులను దేశ ప్రజలే తన కుటుంబం గా పని చేస్తున్న మోడీ గారు మూడవ సారి ప్రధానిగా కావాలని ఈ రోజు ప్రజలంతా కోరుకుంటున్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపి బిజెపి అభ్యర్ధి మాధవనేని రఘునందన్ రావును భారీ మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు సూచించారు.ఈ కార్యక్రమంలో బిజెపి మండల అద్యక్షులు దయానంద రెడ్డి, ధర్మారం వార్డు సభ్యులు లక్ష్మణ్, స్వామీ, సతీష్ ,బిజెపి జిల్లా సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి, నవాత్ రాజేంద్ర ప్రసాద్, జె.శంకర్ గౌడ్ యువకులు పాల్గోన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!