Reporter -Silver Rajesh Medak.
తేదీ 4-5-2024.
ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా అదనపు ఎన్నికల అధికారి /అదనపు కలెక్టర్ వేంకటేశ్వర్లు
సాధారణ ఎన్నికలు 2024, నియమావళి అమలులో బాగంగా శనివారం ఆర్డిఓ మెదక్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం లో జిల్లా అదనపు ఎన్నికల అధికారి/అదనపు కలెక్టర్ వేంకటేశ్వర్లు ,తన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ పద్దతిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.వేలుకు సిరా చుక్క చూపిస్తూ ప్రజలంతా తమ అమూల్యమైన ఓటు ను వినియోగించుకోవాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ జిల్లా 100 శాతం ఓటింగ్ లక్ష్యంతో ముందుకు వెళ్లాలని , మే 13 న ఓటర్లు ,తమకు కేటయించిన పోలింగ్ కేంద్రాల్లో కి వెళ్లి స్వచ్ఛందంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.