Reporter -Silver Rajesh Medak.
Date – 04.05.2024.
పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న మెదక్ జిల్లా ఎస్.పి డా.శ్రీ.బి.బాలస్వామి ఐ.పి.ఎస్
లోక్ సభ ఎన్నికల్లో భాగంగా మెదక్ పట్టణంలోని RDO కార్యాలయంలో జిల్లా ఎస్.పి డా.శ్రీ.బి.బాలస్వామి ఐ.పి.ఎస్ గారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డా.శ్రీ.బి.బాలస్వామి ఐ.పి.ఎస్ గారు మాట్లాడుతూ….. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కుకు చాలా ప్రాధాన్యం ఉన్నదని ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న ఎన్నికల్లో పౌరులు ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు. అలాగే బాయ్స్ జూనియర్ కాలేజీ మెదక్ నందు ఏర్పాటు చేసిన EVM కేంద్రాన్ని సందర్శించి అక్కడ ఉన్నా భద్రత సిబ్బందికి పలు సూచనలు చేయడమైనది. అలాగే ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు సంబంధిత అధికారుల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుతంగా వినియోగించుకునేలా పోలీస్ సిబ్బంది వారికి భద్రత కల్పిస్తూ, పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని, ఎన్నికల నిర్వహణ గురించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ RDO కె.రమాదేవి,మెదక్ డి.ఎస్.పి డా.రాజేష్ ,మెదక్ యం.ఆర్..ఓ.శ్రీనివాస్ గారు,ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.