వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు…

వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు…

మంత్రి సీతక్క గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ మరియు తెలంగాణ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి దనసరి సూర్య గార్లు…

మంగపేట మండల తిమ్మంపేట, బుచ్ఛంపేట, చేరుపల్లి, బాలన్నగూడెం గ్రామల నుండి సుమారుగా 200 మందికి పైగా చేరికలు…

కాంగ్రెస్ పార్టీని నమ్మి పార్టీలోకి వస్తున్న వివిధ పార్టీల నాయకులకు అందరికీ అండగా సీతక్క గారు ఉంటారు…

నూతనంగా పార్టీలోని వచ్చిన వారందరికీ ఆహ్వానం పలికిన అశోక్ మరియు సూర్య గార్లు…

మహాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బలరాంనాయక్ గారి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలి…

రాహుల్ గాంధీ గారు ప్రధాని అవడమే మన అందరి లక్ష్యంగా పని చేయాలని ఆదేశించిన అశోక్ మరియు సూర్య గార్లు…

 తేది: 04.05.2024 శనివారం అనగా ఈరోజున మంగపేట మండల తిమ్మంపేట గ్రామం నందు మండల ఇంఛార్జిలు మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇరుసవడ్ల వెంకన్న, పూజారి సురేందర్ మరియు మండల అధ్యక్షులు మైల జయరాంరెడ్డి గారి ఆధ్వర్యంలో మండల విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయగా అట్టి సమావేశానికి ముఖ్య అతిథులుగా ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ మరియు  తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దనసరి సూర్య గార్లు విచ్చేసి తిమ్మంపేట, బుచ్చంపేట, బాలన్నగూడెం మరియు చెరుపల్లి గ్రామాల నుండి వివిధ పార్టీల నుండి సుమారుగా 200 మందికి పైగా కాంగ్రెస్ పార్టీలో చేరగా, అశోక్ మరియు సూర్య గార్లు వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భముగా అశోక్ మరియు సూర్య గార్లు మాట్లాడుతూ నూతనంగా కాంగ్రెస్ పార్టీలోకి విచ్చేసిన వారందరికీ స్వాగతం తెలుపుతూ, ప్రతి ఒక్కరికీ అండగా సీతక్క గారు ఉన్నారని, అందరూ ఐకమత్యంగా ఉండి కాంగ్రెస్ పార్టీ మహాబాద్ ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేసి, రాహుల్ గాంధీ గారిని ప్రధాన మంత్రి చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అంటేనే త్యాగాల పార్టీ, భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, భారతావని సంకెళ్లు తెంచి భరతమాత నుదిట సింధూరం దిద్దిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ, అటువంటి కాంగ్రెస్ పార్టీ కొందరు నాయకులు విమర్శించడం సిగ్గు చేటు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆర్థిక సంస్కరణలు, పంచవర్ష ప్రణాళికలు, ప్రాజెక్టులు, రాజాభరణాల తొలగింపు, బ్యాంకింగ్ వ్యవస్థ, భూ సంస్కరణల చట్టం, పేదలకు భూములకు పంపిణీ, వ్యవసాయాభివృద్ధి, భారీ, మధ్య తరహా పరిశ్రమలను నెలకొల్పడం, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ ఆరోగ్య శ్రీ, రైతులకు ఉచిత విద్యుత్, లక్ష రూపాయల పంట రుణమాఫీ, ఆహార భద్రత చట్టం, అటవీ హక్కుల చట్టం, ఇందిరా క్రాంతి పథం, డ్వాక్రా రుణాలు, పేద ప్రజల అభివృద్ధి కొరకు ఎన్నో అత్యుత్తమ పథకాలు రూపొందించిన అత్యుత్తమ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలు పెంచి, ఇంధనం ధర పెంచి, జి.ఎస్టీ ద్వారా పేదల నడ్డి విరుస్తూ, ఆదాని, అంబానీ లాంటి కార్పొరేట్ వ్యక్తుల చేతిలో దేశం యొక్క భవితవ్యాన్ని తాకట్టు పెట్టారని అన్నారు. మతం పేరుతో విద్వేషాలను రెచ్చగొడుతూ, కావాలని మతం పేరిట మారణహోమం చేస్తూ భారత దేశ భవిష్యత్తును నాశనం చేస్తున్నారని అన్నారు. ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని గద్దెనెక్కిన బీజేపీ పార్టీ, ప్రధాని అయి పదేండ్లు కావోస్తున్నా ఇంతవరకు ప్రతి ఏటా ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా దేశం యొక్క భవిష్యత్తును నాశనం చేస్తున్నాడని అన్నారు. తాతల దగ్గరి నుండి ధనిక కుటుంబం అయిన రాహుల్ గాంధీ గారి కుటుంబం ప్రజా సేవా కొరకు వారి డబ్బును పెట్టారు తప్ప, ఇప్పటివరకు సొంత ఇల్లు కూడా లేని వ్యక్తి రాహుల్ గాంధీ గారు అని అన్నారు. దేశానికి ప్రధాన మంత్రి రాహుల్ గాంధీ గారు కావాలంటే మనమందరం చేతి గుర్తుకు ఓటు వేసి బలరాంనాయక్ గారిని గెలిపించాలని కోరారు. గత 34 యేండ్ల నుండి గాంధీ కుటుంబం నుండి ప్రధాని అయ్యే అవకాశం ఉన్న కూడా తృణపాయంగా వదిలిన కుటుంబం రాహుల్ గారి కుటుంబం అని అన్నారు. 

 మహాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ గారు మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని, ఇదివరకు కాంగ్రెస్ హయాంలో కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ములుగు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధిలోకి తీసుకొచ్చాడు అని, ఎన్నో జాతీయ రహదారులు, వంతెనలు, స్కూళ్లు తీసుకువచ్చిన ఘనత బలరాంనాయక్ గారిది అని అన్నారు. సీతక్క గారు మంత్రిగా గెలిచిన మూడు నెలల్లో నియోజకవర్గంలోని ప్రతి మండలానికి 3 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి రోడ్లు వేయించారు అని, ఇంకా పది కోట్ల రూపాయలను నియోజకవర్గంలోని అంతర్గత రోడ్ల కొరకు తీసుకువస్తున్నారు అని, ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున, ఎలక్షన్ కోడ్ ముగియగానే వెంటనే ఆ పనులు ప్రారంభించి ములుగు నియోజకవర్గంలోని ప్రతి రోడ్డు సీసీ రోడ్డు చేసి నిజమైన అభివృద్ధి చేస్తారని అన్నారు. అందుకు మీరంతా ఏకమై బలరాంనాయక్ గారి చేతి గుర్తుపై ఓటు వేసి అతన్ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్న అని, ఎంపీగా అతను గెలవడం వలన, గిరిజన ప్రాంతాలకు కేంద్రం నుండి నిధులు ఎక్కువగా వస్తాయని, సీతక్క గారి చెయ్యికి అతని చెయ్యి కూడా తోడైతే ములుగు నియోజకవర్గం అత్యంత తొందరగా అభివృద్ధి జరుగుతుందని కావున కార్యకర్తలు అందరూ సీతక్క గారిని ఎలా అయితే భారీ మెజారిటీతో గెలిపించారో అలాగే బలరాంనాయక్ గారిని గెలిపించాలని కోరారు. 

 బి.ఆర్.ఎస్.పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి విచ్చేసిన సభ్యులు పూజారి ఏకాంతం గౌడ్, నక్క ముత్యాలు, నక్క వీరయ్య, నాలి లక్ష్మి బాబు, చీమల రవి, ముత్యం కృష్ణ, కొత్తోజు వెంకటేశ్వర్లు, కొత్తపల్లి సారయ్య, నక్క సైదులు, పడకంటి కృష్ణ చారి, తుమ్మల సుధాకర్ రెడ్డి, మెరుగు నాగభూషణం గౌడ్, సామ యుగేందర్ రెడ్డి, పల్లె రాములు, చిన్నపల్లి నరసింహ రావు, పెండెమ్ సమ్మయ్య, నన్నే బోయిన శ్రీనివాస్, వేల్ఫల తిరుపతయ్య, మద్దిరాల నరేందర్, బంటు విశ్వనాథం, బత్తుల బాలకృష్ణ, దంతాలపల్లి సాంబయ్య, గంగేర్ల నరసింహ రావు, మద్దిరాల సత్యనారాయణ, పోలేబోయిన అర్జున్ రావు, బాంబోతుల నాగార్జున, బీజేపీ పార్టీ నుండి గడ్డం ఉప్పలయ్య గౌడ్, పగిడిపల్లి వీరయ్య, పగిడిపల్లి కొమురయ్య బీఎస్పీ పార్టీ నుండి ములుగు అసెంబ్లీ ప్రెసిడెంట్ ఎంపెల్లి వీరస్వామి, బీఎస్పీ పార్టీ మంగపేట మండల అధ్యక్షులు  ఉర్లగొండ మురళీ గౌడ్, తోటమల్ల అభ్రహం గార్లతో పాటు ఇంకా 150 మందికి పైగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.

 ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వికలాంగుల చైర్మన్ ముత్తినేని వీరయ్య, మాజీ జడ్పీటీసీ కోట మల్లికార్జున్, మంగపేట మండల రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాల్లు, యూత్ నాయకులు అందరూ పాల్గొన్నారు.
Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!