నార్సింగి మండలంలోని శేరిపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం పనులు నిర్వహిస్తున్న చోట బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ను మరోసారి నమ్మి మోసపోవద్దని నార్సింగి జెట్పిటీసీ భాణపురం కృష్ణారెడ్డి, ఎంపీపీ అధ్యక్షులు చిందం సబితా కోరారు. కాంగ్రెస్ మోసపూరిత హమీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను ధగా చేసిందన్నారు. కాంగ్రెస్ చెంపపెట్టు పెట్టేందుకు బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామ్ రెడ్డి ని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిన్నశంకరంపేట బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పట్లోరి రాజు, శేరిపల్లి ఎంపీటీసీ సంతోష, తాజా మాజీ సర్పంచ్ మల్లేశం, బీఆర్ఎస్ గ్రామ నాయకులు బోయిని రమేష్, కందరి శ్రీనివాస్, ఇండ్ల శ్రీనివాస్, మేకల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.