లిల్లీ పుట్ రేవంత్ రెడ్డి సిద్దిపేట కు వచ్చి మొరిగిండు

Reporter -Silver Rajesh Medak.

Date-04/5/2024.

లిల్లీ పుట్ రేవంత్ రెడ్డి సిద్దిపేట కు వచ్చి మొరిగిండు

ఉద్యమాల ఖిల్లా సిద్దిపేట జిల్లా, నీ పప్పలు ఉడకవు

నీ కొడంగల్ వచ్చి నిన్ను ఒడగొట్టా..బిడ్డా రేవంత్

నీ తాత జెజమ్మలు వచ్చినా సిద్దిపేటలో నీ డ్రామా నడువదు.

కుక్క కాటుకు చెప్పు దెబ్బ . ఓటుతో బుద్ధి చెప్పాలి.

మెదక్ బిఆర్ఎస్ ఎంపి అభ్యర్థి వెంకట్ రామా రెడ్డికి మద్దతుగా, నారాయణ్ రావు పేట్ లో నిర్వహించిన రోడ్ షో లో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు,

హరీష్ రావు కామెంట్స్…..

కేసీఆర్ లేకుంటే సిద్దిపేట జిల్లా అవునా.
తెలంగాణ రాష్ట్రం వచ్చునా.

రేవంత్ రెడ్డి ఆంధ్రా నాయకుల కాళ్ళకు మడుగులు వొత్తుకుంటూ ఉండేవాడు

కొత్త జిల్లాలు, కొత్త మండలాలు చేసిండు కెసిఅర్.
పిచ్చి మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డికి మనం బుద్ధి చెప్పాలి.
సిద్దిపేటలో వాళ్ళ రాజకీయం నడువదు.

ఇక్కడకు వచ్చి చిల్లర మాటలు మాట్లాడారు.
ఒక్క మాట కాంగ్రెస్ ఇచ్చిన మాట అమలు కాలేదు.

రైతు బీమా, రుణమాఫీ, కల్యాణ లక్ష్మి, తులం బంగారం, 24 గంటల కరెంటు ఇలా ఎన్నో ఫెయిల్యూర్స్.
బీడీలపై కాంగ్రెస్ పుర్రె గుర్తు పెడితే, బిజెపి పన్ను వేసింది.
30 ఏళ్లు చేస్తే గాని ఫించన్ ఇచ్చేది లేదని బీడీ కార్మికులకు నష్టం చేశారు.

గతంలో బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి.
దాన్ని మార్చింది కెసిఆర్. ఆ బతుకులను బాగు చేసింది కెసిఆర్

సాగు, తాగు నీరు డొకా లేకుండా చేసింది కేసీఆర్.
అసెంబ్లీలో వీళ్ళను ప్రశ్నించాలని అంటే నాకు మీ మద్దతు కావాలి
కారు గుర్తుకు ఓటు వేసి వెంకట్రామ రెడ్డిని గెలిపించాలని కోరుతున్నాం.

జిల్లాలు తక్కువ చేస్తా అంటున్నాడు రేవంత్ రెడ్డి.
ఎంపి ఓటు కాంగ్రెస్ కు వేస్తే సిద్దిపేట జిల్లా లేకుండా చేస్తాడు.

బిజెపి పదేళ్లు డిల్లీలో ఉండి మనకు చేసింది ఏం లేదు.
రఘునందన్ కు సిద్దిపేట అంటే ఓర్వలేనితనం.
ఎంతసేపు నామీద ఎడవడమే
సిద్దిపేట అభివృద్ధిని అడ్డుకున్నోడు గెలవలా, అభివృద్ధి చేసిన బి ఆర్ ఎస్ పార్టీ గెలవాలా.

వెంకట్ రామా రెడ్డి వేరు, హరీష్ రావు వేరు కాదు.
వెంకట్రామిరెడ్డి గెలుపు అంటే హరీష్ అన్న గెలుపు.
సిద్దిపేటను విద్యకు నిలయంగా మార్చాను.

వెటర్నరి కాలేజీని కొడంగల్ కు ఎత్తుకు పోయారు.
అన్ని గద్ద లాగా తన్నుకు పోయాడు.
నేను కష్టపడి అన్ని కాలేజీలు, దవాఖానలు తెచ్చా.
మాకు అన్యాయం చేసే కాంగ్రెస్ కు ఎందుకు ఓటు వేయాలి.
సిద్దిపేట లో 1000 పడకల ఆసుపత్రి తెచ్చా.

ఒక్క సీటీ వేస్తే హరీష్ అన్న ఉండగా, ఈ కాంగ్రెస్ బిజెపి వాళ్లు ఎందుకు.
5 ఏళ్లకు ఒకనాడు వస్తారు. మాటలు చెప్పి పోతరు.

సింగూరు సింహ గర్జన పెడితే మీతో పాటు నాడు లారీల్లో వచ్చాను. నారాయణ రావు పేట్ నుండి సంగారెడ్డికి వచ్చా.

రేవంత్ రుణమాఫీ చేస్తా అని మాట తప్పారు.

ఆగస్టు 15 వరకు ఆరు గ్యారేంటీలు, రుణమాఫీ చెయ్యి నేను నేను సిద్దిపేట ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా అన్న. తోక ముడిచిండు.
మళ్ళీ చెబుతున్న నాకు పదవి ముఖ్యం కాదు. మీ అందరికీ లాభం అయితే అదే నాకు సంతోషం

నేను సవాల్ విసిరితే తోక ముడిచింది.
శాసన సభలో వచ్చే 5 ఏళ్లు గడగడ లాడిస్తం.
700 మంది రైతులను చంపింది డిల్లి బిజెపి.
ఎంపి అభ్యర్థి వెంకటరామరెడ్డి కామెంట్స్…
11 సంవత్సరాలు ఉమ్మడి మెదక్ జిల్లాలో పీడీగా, జాయింట్ కలెక్టర్ గా, కలెక్టర్ గా వివిధ హోదాల్లో మీకు సేవ చేసే భాగ్యం కలిగింది.

మీ ఆదరణను, ఆప్యాయతను ఎప్పటికీ మరిచిపోలేను. మీ సేవకుడిగా, మీలో ఒకడిగా ఉండాలని మీ ఆశీర్వాదం కోరుతూ మెదక్ ఎంపీగా మీ ముందుకు వస్తున్నాను.

ఉమ్మడి మెదక్ ప్రజల రుణం తీర్చుకోవాలనే సదుద్దేశ్యంతో, నా ఉమ్మడి కుటుంబ ఆస్తి నుంచి రూ. 100 కోట్లతో వెంకటరామ రెడ్డి ట్రస్టు ద్వారా సేవలందిస్తాను.

పేద పిల్లలకు విద్య, ప్రభుత్వ ఉద్యోగాల శిక్షణ, యువతకు స్కిల్ డెవలప్మెంట్, మహిళా సాధికారత కోసం కార్యక్రమాలు నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.

నిబద్ధత కలిగిన అధికారిగా, పేదలకు సేవ చేసిన వ్యక్తిగా ఉమ్మడి మెదక్ ప్రజలకు నా జీవితం తెరిచిన పుస్తకం. మరోసారి మీకు సేవ చేసే అవకాశం ఇవ్వాలని, మీ ఎంపీగా నన్ను దీవించాలని చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!