అదనపు ఈవీఎంల రెండవ రాండమైజేషన్ జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్

Reporter -Silver Rajesh Medak.

Date-03/05/2024.

అదనపు ఈవీఎంల రెండవ రాండమైజేషన్ జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్.

ఎన్నికల సాధారణ పరిశీలకులుసమీర్ మాధవ్ కుర్కోటి రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో రెండవ ఈవీఎం ల రాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేశామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ పేర్కొన్నారు.

పార్లమెంటు ఎన్నికల నేపధ్యంలో మెదక్ పార్లమెంట్ స్థానానికి 44 మంది పోటీలో ఉన్నందున( 01) నోటా
ఎన్నికల సంఘం కేటాయించిన ఆదనవు ఈవీఎం లకు
నియోజక వర్గాల వారీగా మెదక్ నర్సాపూర్ , సిద్దిపేట , సంగారెడ్డి దుబ్బాక , పటాన్ చెరువు, గజ్వేల్ లోని పోలింగ్ కేంద్రాలకు 3 బ్యాలెట్ యూనిట్లు, 01 కంట్రోల్ యూనిట్లు
,01 వి.వి.ప్యాట్ల రెండో విడత
రాండమైజేషన్ ను ఈ ఎం ఎస్ సాఫ్ట్ వేర్ ను వినియోగిస్తూ ఆన్లైన్ లో జిల్లా ఎన్నికల అధికారి శుక్రవారం ఎన్నికల , వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని
34 మెదక్,37- నర్సాపూర్,33- సిద్దిపేట్,41- దుబ్బాక,42- గజ్వేల్,39- సంగారెడ్డి,40- పటాన్ చెరువు అసెంబ్లీ నియోజకవర్గాలకు 2124 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి మొత్తం బ్యాలెట్ యూనిట్లు 7961 బ్యాలెట్ యూనిట్లు (125 శాతం),
కంట్రోల్ యూనిట్లు2652
( 125 శాతం), వివి ప్యాడ్స్ -2970
(140 శాతం)
రెండవ రాండమైజేషన్ ద్వారా ఎన్నికల నిబంధనల మేరకు ఆయా నియోజకవర్గాలకు కేటాయించడం జరిగిందని అన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, , వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!