Reporter -Silver Rajesh Medak.
Date-103/05/2024.
జిల్లాలో ప్రారంభమైన హోమ్ ఓటింగ్ ఏ ఆర్ ఓ ఆర్ డి ఓ రమాదేవి *
ఎనభై ఏళ్లకు పైబడిన వృద్ధులు, 40 శాతం వైకల్యం కలిగిన దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు వేసే సదుపాయం
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో హోం ఓటింగ్ శుక్రవారం ప్రారంభమైందని జిల్లాలో ఈ నెల 3 వ తేదీ నుంచి
6 వ తేదీ వరకు అధికారులు హోం ఓటింగ్ కు అవకాశం కల్పించాలని ఆర్డిఓ రమాదేవి తెలిపారు
శుక్రవారం మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలంలో ఓం ఓటింగ్ కార్యక్రమాన్ని ఏ ఆర్ ఓ రమాదేవి పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎనభై ఏళ్లకు పైబడిన వృద్ధులు, 40 శాతం కు పైబడి వైకల్యం కలిగిన దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు వేసే సదుపాయాన్ని ఎన్నికల సంఘం కల్పించిందని
జిల్లా పరిధిలోనీ మెదక్, నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఇంటి వద్ద నుంచి ఓటు వేసే అవకాశం వచ్చిందని
ఒక్కో బృందం లో ప్రిసైడింగ్ అధికారి,సహాయ ప్రిసైడింగ్ అధికారి, మైక్రో ఆబ్జర్వర్, పోలీస్ అధికారి, వీడియో గ్రాఫర్ లు మొత్తం 5 మంది ఉంటారు. అధికారిక వాహనంలో వీరు ఇంటింటికీ ఎన్నికల సామగ్రితో వెళ్లి హోమ్ ఓటింగ్ అవకాశం కల్పిస్తారు. ఇంటి వద్ద సాధారణ పోలింగ్ కేంద్రం మాదిరి ఏర్పాటు
చేశామన్నారు
అధికారులు ఓటరు ఇంటికి వెళ్లి ఓ తాత్కాలిక ఓటింగ్ కంపార్ట్మెంట్ ను ఏర్పాటు చేస్తారు. ఓటరు దానిలోకి లోకి వెళ్లి బ్యాలెట్ పేపర్ పైన తనకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయాలి. ఆ తర్వాత బ్యాలెట్ పేపరును చిన్న కవరు (ఫామ్ 13బీ)లో ఉంచి ఎన్నికల అధికారికి ఇవ్వాలి. ఓటు ధ్రువీకరణ పత్రం ఫామ్ 13ఏ పైన సంతకం చేయాలి. ఆ రెండు ఫామ్‌లను పెద్ద కవరులో వేసి, ఓటును సీల్ చేస్తారని వివరించారు
మెదక్ నియోజకవర్గంలో దివ్యాంగులు,వృద్దులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా 83, ఓం ఓటింగ్ 336 తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అలాగే నర్సాపూర్ నియోజకవర్గంలో
పోస్టల్ బ్యాలెట్ 13 మంది ఉపయోగించుకోగా హోమ్ ఓటింగ్ 215 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.