Reporter -Silver Rajesh Medak.
Date-03/05/2024.
ఎంసిసి ఉల్లంఘనల పై అప్రమత్తంగా ఉంటూ నివేదికలు వెంటనే సమర్పించాలి
మెదక్ జిల్లా రిటర్నింగ్ అధికారి రాహుల్ రాజ్
సమీకృత జిల్లా ఫిర్యాదుల పర్యవేక్షణ కేంద్రం పనితీరును పరిశీలించిన రాహుల్ రాజ్
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అక్రమ నగదు, మధ్యం జప్తు, అభ్యర్థుల ఎన్నికల ఖర్చు వివరాలు,1950 టోల్ ఫ్రీ నెంబర్, సి విజల్ యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులు, సామాజిక మాధ్యమాల్లో గమనించే ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు మొదలగు నివేదికలను ప్రతిరోజు సకాలంలో సమర్పించాలని మెదక్ పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాహుల్ రాజ్ అన్నారు.
శుక్రవారం మెదక్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఎన్నికల సమీకృత ఫిర్యాదులు పర్యవేక్షణ కేంద్రం ను, మీడియం సందీప్ ఎం సి ఎం సి మీడియా సెంటర్ ను, నోడల్ ఆఫీసర్ రామచంద్ర రాజు తో కలిసి పరిశీలించారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సమీకృత జిల్లా ఫిర్యాదుల కేంద్రం లో Gps మానిటరింగ్, 1950 కాల్ సెంటర్, కంట్రోల్ రూం, సి – విజిల్, ఎంసీఎంసి, సోషల్ మీడియా విభాగాల పనితీరును ఈ సందర్భంగా ఈ డి యం సందీప్ నోడల్ ఆఫీసర్ రామచంద్ర రాజు ఎన్నికల రిటర్నింగ్ అధికారి గారికి వివరించారు.
ఎన్నికల సమీకృత జిల్లా ఫిర్యాదుల కేంద్రం పనితీరు పట్ల రిటర్నింగ్ అధికారి సంతృప్తి వ్యక్తం చేశారు.