మెదక్ పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల సరళిని పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి

Reporter -Silver Rajesh Medak.

తేదీ:3-5-2024.

మెదక్ పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల సరళిని పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి / జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

IDOC , ఆర్డీవో మెదక్ కార్యాలయంలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ల సరళిని శుక్రవారం జిల్లా ఎన్నికల అధికారి / కలెక్టర్ రాహుల్ రాజ్,జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వరులు, కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ సరళిని , ఎలాంటి పొరపాట్లు చెయ్యొద్దని, ఓటు వేయడానికి వచ్చే ప్రతి ఓటర్ కి గుర్తింపు కార్డు ఉండాలని అన్నారు . ఫారం 13ఏ, 13బి, 13సి లను సరిచూసుకోవాలని, పోలింగ్ కేంద్రం వద్ద ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని పోస్టల్ బ్యాలెట్ నిర్వహణ గురించి, రాజకీయా పార్టీలకు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ముందే సమాచారం ఇచ్చామని, ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ప్రతీ ఉద్యోగి తన విలువైన ఓటు వినియోగించాలని ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలని , పోస్టల్ బ్యాలెట్ల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసామని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ తెలిపారు. ఇతర నియోజక వర్గం నుంచి వచ్చి మెదక్ జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్నవారు IDOC , ఆర్డిఓ మెదక్ కేంద్రాలలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని, తెలియజేశారు .
ఈ కార్యక్రమం లో ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!