సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని మునిగడప గ్రామంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పనుగట్ల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రాoరెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడారు… అభివృద్ధి సంక్షేమానికి పెద్ద పీట వేసిన కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించగా, అధికారం చేపట్టిన 4 నెలల్లోనే కాంగ్రెస్ పేద ప్రజలను తీవ్ర ఇబ్బందులకు అధికారకాంక్షతో 6 గ్యారంటీలు ప్రకటించిన కాంగ్రెస్ ప్రస్తుతం ఏ ఒక్కటిని పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని ప్రజల సంపూర్ణ ఆశీస్సులతో మెదక్ పార్లమెంట్ బిఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రాoరెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుండ రంగారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, బుద్ధ నాగరాజు, కవిత శ్రీనివాస్ రెడ్డి, ఎక్బాల్, పీర్లపల్లి యాదవ్ రెడ్డి, రాజేశ్వరి రవి, పలుగు గడ్డ అంజి , గుర్రం సుధాకర్, జితేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.