Reporter -Silver Rajesh Medak.
Date-02/5/2024.
నిష్పక్షపాతంగా ఎన్నికల విధులు నిర్వహణ: కేంద్ర. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమీషనర్ నితేష్ వ్యాస్
*లోక్ సభ ఎన్నికల పోలింగ్ పై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమీషనర్ నితేష్ వ్యాస్
లోక్ సభ ఎన్నికల విధులను ప్రతి ఒక్కరు నిష్పక్షపాతంగా నిర్వహించాలని, పోటీ చేస్తున్న ప్రతి అభ్యర్థిని ఒకే తరహాలో చూడాలని సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమీషనర్ నితేష్ వ్యాస్ అన్నారు.
గురువారం న్యూ ఢిల్లీ నుంచి సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేష్ వ్యాస్ ఎన్నికల పోలింగ్ నిర్వహణ, సన్నద్ధతపై నిర్వహించిన వీడియో సమావేశంలో హైదరాబాద్ నుండి తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి పాల్గొనగా, మెదక్ జిల్లా వీడియో కాన్ఫరెన్స్ సమావేశం మందిరం నుండి జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్, సాధారణ పరిశీలకులు సమీర్ మాధవ్ కుర్కోటి, వ్యయ పరిశీలకుడు సునీల్ కుమార్ రజ్వాన్షి IRS ,జిల్లా ఎస్పీ డా: బాలస్వామిలతో కలిసి పాల్గొన్నారు.
సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమీషనర్ నితేష్ వ్యాస్ మాట్లాడుతూ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో పారదర్శకంగా విధులు నిర్వహించాలని, అందరినీ సమానంగా చూడాలని ఎవరి పట్ల పక్షపాతంతో వ్యవహరించడం చేయవద్దని తెలిపారు. ఎన్నికల విధులు భారత ఎన్నికల కమీషన్ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం పక్కాగా జరగాలని, ఎక్కడా ఏచిన్న పొరపాటు రాకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
అదనపు బ్యాలెట్ యూనిట్ల ఎఫ్.ఎల్.సి, ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని, వంద శాతం ప్రతి ఓటరుకు ఓటర్ సమాచార స్లిప్పు పంపిణీ చేయాలని, పోలింగ్ సిబ్బందికి అవసరమైన మౌళిక వసతులు కల్పించాలని, డబ్బు, మధ్యం పంపిణీ జరగకుండా పక్కా నిఘా ఏర్పాటు చేయాలన్నారు.సి విజల్ యాప్ ను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకుని వెళ్ళాలని తెలిపారు.
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మెదక్ పార్లమెంటు రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ, జిల్లాలో ఇప్పటివరకు 70 శాతం ఓటర్ సమాచార స్లిప్పులు పంపిణీ చేశామని, మిగిలిన ఓటర్లకు సైతం పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని అన్నారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళి పకడ్బందీగా అమలు చేస్తున్నామని, ఎన్నికలలో డబ్బు, మద్యం ప్రభావం లేకుండా అప్రమత్తంగా ఉంటూ తనిఖీలు చేపట్టామని అన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద కనీస మౌలిక సదుపాయాల తో పాటు వేసవి దృష్ట్యా నీడ, తాగునీరు, మెడికల్ కిట్లు, ఓ ఆర్ ఎస్ కల్పిస్తున్నట్లు తెలిపారు. అదనంగా ఈసీ ఐ నుండి స్వీకరించిన వెయ్యి బ్యాలెట్ యూనిట్ల కు ఎఫ్ ఎల్ సి నిర్వహిస్తున్నట్లు,పూర్తి కాగానే రాండమైజ్షన్ ద్వారా అసంబ్లీ సెగ్మెంట్లకు కేటాయిస్తామన్నారు.
సి విజల్, 1950 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని, జిల్లాలోపారదర్శకంగా ఎన్నికలను నిర్వహించేందుకు సన్నద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు.
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మెదక్ ఎన్నికల సాధారణ పరిశీలకులు సమీర్ మాధవ్ కుర్కోటి మాట్లాడుతూ, మెదక్ పార్లమెంటు పరిధిలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించడం జరిగిందని, పోలింగ్ కేంద్రాలలో అవసరమైన వసతులు కల్పన పూర్తయిందని,అన్ని ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న వ్యయ పరిశీలకుడు సునీల్ కుమార్ రాజ్వాన్సి IRS మాట్లాడుతూ, పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన భద్రత వ్యవస్థ ఏర్పాటు చేశామని, ఈవీఎం యంత్రాల తరలింపు, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, రిసెప్షన్ కేంద్రాల వద్ద అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఎన్నికలలో డబ్బు, మద్యం ప్రభావం ఉండకుండా నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నామని, అక్రమ డబ్బు, మద్యం పంపిణీ కాకుండా గట్టి వ్యవస్థ ఏర్పాటు చేశామని తెలిపారు.
జిల్లా ఎస్పీ బాల స్వామి మాట్లాడుతూ*ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పర్యవేక్షిస్తున్నామని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి అదనంగా బలగాలను ఏర్పాటు చేసి పోలింగ్ సులువుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని, ఎస్ ఎస్ టి బృందాలు నిత్యం చురుకుగా పనిచేస్తూన్నాయని, డబ్బు మద్యం రవాణా ను అరికట్టే తీరు సంతృప్తిగా ఉందన్నారు.
ఈ వీడియో సమావేశంలో సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.