Reporter -Silver Rajesh Medak.
Date-02/05/2024.
మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచందర్ గౌడ్ విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రామచంద్ర గౌడ్ మాట్లాడుతూ కోనాపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి దేవేందర్ రెడ్డి ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో రెండు కోట్ల 26 లక్షల పై చిలుకు రూపాయల నిధులు దుర్వినియోగం జరిగిందని తీవ్రంగా విమర్శించారు దేవేందర్ రెడ్డి మూలంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సభ్యులైన సుమారు 600 మంది రైతులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని ఆవేదన చెందారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని చెందిన డబ్బులు ప్రస్తుతం వడ్డీతో ఆరు కోట్ల రూపాయలు అవుతాయని ఈ డబ్బులను వెంటనే రికవర్ చేసి ఈ సంఘటనకు బాధ్యులైన మెదక్ మాజీ ఎమ్మెల్యే భర్త దేవేందర్ రెడ్డి పై అలాగే అప్పటి సొసైటీ సీఈఓ గోపాల్ రెడ్డి పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాలని అధికారులకు సూచించారు. న్యాయం చెయ్యని యెడల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ధర్నాలు రాస్తారోకోలు చేపడతామని సంబంధిత అధికారులను హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మెదక్ జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షులు ఎంపిటిసి నాగులు ఓ బి సి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.