సీఎం సిద్దిపేట కు బయలుదేరిన నార్సింగి మండల నాయకులు
మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో నుంచి గురువారం నాడు సిద్దిపేట లో జరుగుతున్న సీఎం రేవంత్ రెడ్డి సభకు నార్సింగి కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు భారీ ఎత్తున బయలుదేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల ప్రచారం లో భాగంగా నేడు నిర్వహిస్తున్న సభకు దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచర్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ల ఆదేశాల ప్రకారం పలు గ్రామాల నుండి భారీగా నాయకులు బయలుదేరుతున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం సీఎం రేవంత్ రెడ్డి మద్దతుగా వెళ్తున్నామన్నారు. లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ప్రతి కార్యకర్త సీఎం రేవంత్ రెడ్డి ఆదేశానుసారంగా కష్టపడి శ్రమిస్తామని తెలిపారు. కార్యక్రమంలో. సిద్దిపేట సభకు బయలుదేరిన వారిలో మండల అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, యూత్ అధ్యక్షుడు బాచీ స్వామి, ఎంపిటిసి సత్యనారాయణ. బీసీ మండల అధ్యక్షుడు రాజు గౌడ్, అంచనూరి రాజేష్, సుధాకర్. శంకర్ నాయక్. రాములు నాయక్.జాని, మైనారిటీ నాయకుడు ఖుర్షీద్. సిహెచ్ ప్రభాకర్. దొంతి దేవదాస్. దొంతి స్వామి. తదితరులు ఉన్నారు.