ఫెయిల్యూర్ గొప్ప విజయమే ఫెయిల్యూర్ నీ అంతం లా కాదు పంతం లా స్వీకరించాలి
పది ఫెయిల్ అయిన విద్యార్థులు అవమానంగా అధైర్య బాధ పడొద్దు
ఫెయిల్యూర్ అయి విజయాన్ని తమ జీవితంలోనే ఫెయిల్యూర్ లేకుండా రాకుండా సొంతం చేసుకున్న చదువు మేధావుల చరిత్ర తెలుసుకోవాలి ఫెయిల్యూర్ అయితేనే ఎక్కడ తప్పుచేశాం ఎక్కడ ఏది వదిలేశం ఇలా తదితర అంశాలపై విజయానికి ఆలోచనలు దారి తీస్తాయి అదే పాస్ అయితే ఒక్కటే నేను రాస్తే అంతే మరి పాస్ ఉంటుంది అనేది గర్వం నిర్లక్ష్యం అహంకారం మొదలవుతుంది రాబోవు విజయాలకు ఫెయిల్యూర్ కి దారి తీసి చావుకి సైతం నిర్లక్ష్యం అహంకారం తెచ్చిపెడుతోందని మరువకండి. ఫెయిల్యూర్ ఒక్కటే జీవితానికి అంతం కాదు అది పంతం లా తీసుకుని స్వీకరించాలి అప్పుడే నిన్ను చూసి ఫెయిల్యూర్ మళ్ళీ రావడానికి భయపడుతుంది. పది ఫెయిల్ అయిన విద్యార్థులు అధైర్య పడవద్దని ఒక మీడియా ప్రకటనలో కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు మున్నా ఖాన్, జాడి శ్రీనివాస్, కృష్ణపల్లిసురేష్ తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా పదోతరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. ఇందులో భాగంగా పదవ తరగతి పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులు ఎవరు కూడా అధైర్య పడవద్దని ధైర్యాన్ని సూచించారు. పరీక్షలో ఫెయిల్ అయితే మళ్లీ రాయడానికి సప్లమెంటరీ అనే వజ్రాయుధం ఉందని పేర్కొన్నారు. ఫెయిల్ అయ్యామని విద్యార్థులు తమ జీవితాన్ని చేతుల్లోకి తీసుకుని సూసైడ్ లు ఆత్మహత్యలు లాంటివి అఘాయిత్యాలకు పాల్పడవద్దని తెలిపారు. ఫెయిల్ అయిన విద్యార్థులను వారి వారి తల్లిదండ్రులు ఒక కంట కనిపెడుతూ ధైర్యాన్ని కల్పించాలని పిల్లల పట్లా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.