బీఆర్ ఎస్ మెదక్ పార్లమెంటు అభ్యర్థి వెంకట్ రాంరెడ్డి గెలుపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం

నార్సింగి : రాష్ట్రంలో మే 13 న జరగబోయే లోక్ సభ ఎన్నికల లో బీఆర్ ఎస్ మెదక్ పార్లమెంటు అభ్యర్థి వెంకట్ రాంరెడ్డి గెలుపే లక్ష్యంగా వెంకట్ రెడ్డి సోదరుడు వెంకట నారాయణ రెడ్డి, సోదరి సరిత లు నార్సింగి ఎంపీపీ చిందం సబిత రవీందర్, బీఆర్ ఎస్ మండల అధ్యక్షుడు మైలారం బాబు, నార్సింగి పట్టణ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి పార్టీ నాయకుల తో పాటు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా సాధికారిత కెసిఆర్ తోనే సాధ్యమని, మహిళా సంక్షేమ పథకాలను రాష్ట్రం లో ప్రవేశ పెట్టి నిరంతరాయంగా అమలు పరిచిన ఘనత కెసిఆర్, బీఆర్ ఎస్ ప్రభుత్వానిదే నని పేర్కొన్నారు. ఆసరా పింఛన్లు, వితంతు మహిళల పింఛన్లు, బీడీ కార్మికుల పింఛన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి కార్యక్రమాలు ప్రవేశ పెట్టడమే కాదు నిరంతరాయంగా అమలు చేసి మహిళా సాధికారిత కు పునాది వేసిన ఘనుడు కెసిఆర్ ఆని కొనియాడారు. కెసిఆర్ రైతులకు వ్యవసాయం ఉరి తాడు లా మారిన కాలం లో, రైతు బంధు, రైతు భీమా తో రైతులకు ధీమా ఇచ్చి, మిషన్ భగీరథ తో చెరువుల మరమ్మత్తు, కాలువల తో చెరువుల అనుసంధానం తో భూగర్భ జలాల పెంపు మొదలగు కార్యక్రమాలు చేసి రైతులకు వ్యవసాయం ఒక పండగ అనేలా చేసిన అసలు సిసలైన రైతు బాందవుడు కెసిఆర్ అని పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రం లో కరెంటు లేమి తో బాధ పడుతూ నష్టాల్లో ఉన్న రైతులకు, మూత పడిన పెద్ద చిన్న కర్మాగారాలకు, ఇండ్లకు కోతలు లేని నాణ్యమైన కరెంటు ఇచ్చిన ప్రభుత్వం బీఆర్ ఎస్ అని అన్నారు. శాసన సభ ఎన్నికలలో కాంగ్రెస్ మోస పూరిత మాటలను నమ్మి కాంగ్రెస్ కు ఓటు వేసి ప్రజలు మోసపోయి, ఇప్పుడు కాంగ్రెస్ కు గెలిపించి నందుకు బాధ పడుతున్నారని అన్నారు. ఇప్పుడు జరగబోయే పార్లిమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీ ల గాలి మాటలు, మోసపూరిత వాగ్దానాలు నమ్మే స్థితిలో లేరని, గెలిచి 3 నెలలు దాటుతున్నా కాంగ్రెస్ పార్టీ కెసిఆర్ ప్రవేశ పెట్టిన పథకాలు తప్పా, కొత్తగా అమలు చేసిన కార్యక్రమాలు ఏమీ లేవని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీఆర్ ఎస్ ప్రవేశ పెట్టిన పథకాలు కొనసాగాలంటే పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని అన్నారు. మెదక్ లోక్ సభ బీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్ రెడ్డికి ఐఏఎస్ అధికారి గా చేసిన అనుభవం ఉన్నదని, పరిపాలనా విధానాల పట్ల, ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి అని, వంద కోట్లతో ట్రస్ట్ ను ఏర్పాటు చేసి అభివృధి చేస్తారని అన్నారు. అలాంటి గొప్ప ఆలోచన, సేవా ధృపకథం ఉన్న వ్యక్తిని గెలిపించుకుందామని అన్నారు. మెదక్ గడ్డ బీఆర్ ఎస్ అడ్డా అని, మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కు వచ్చిన 54వేల కంటే ఎక్కువ మెజారిటీ తో వెంకట్ రెడ్డి ని గెలిపించుకుందామని కోరారు. ఈ సందర్భంగా వారితో పాటు దౌలతాబాద్ జెడ్పీటీసీ రణం జ్యోతి, దొమ్మాట మాజీ సర్పంచ్ పూజిత, నార్సింగి మాజీ వార్డు సభ్యులు జోగు జీవన్ కుమార్, ఎండీ ఫరీద్, నాయకులు ఎర్ర కుమార్, ఏర్గమొల్ల కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!