Venkatramulu Ramayampet Reporter
మెదక్ జిల్లా రామాయంపేట పట్టణానికి చెందిన బిఆర్ఎస్ యూత్ ప్రధాన కార్యదర్శి పోచమ్మల గణేష్ తన పదవికి రాజీనామా చేసి రామాయంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీలో తాను ఎంతో కాలంగా క్రియాశీలకంగా పని చేశానని అయినా పట్టణం అభివృద్ధి చెందలేదని తెలిపారు.రామాయంపేట పట్టణము అభివృద్దే లక్ష్యంగా తాను కాంగ్రెస్ పార్టీలోకి చేరినట్లు ఆయన పేర్కొన్నారు.