Reporter -Silver Rajesh Medak.
తేది.29.04.2024
లోకసభ సాదారణ ఎన్నికల నేపథ్యంలో విస్తృత తనిఖీలు
ఆధారాలు లేని 1,00,000/ నగదు సీజ్
స్వేచ్ఛాయుత వాతావరణంతో కూడిన నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణ లక్ష్యంగా మెదక్ జిల్లా పరిధిలో విస్తృత తనిఖీలు చేపట్టినట్లు జిల్లా ఎస్.పి డా.బి.బాలస్వామి ఐ.పి.ఎస్ గారు అన్నారు. జిల్లా పరిధిలోకి అన్ని మార్గాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. సరిహద్దుతో పాటు నగరంలో రాకపోకలు సాగించే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామని తెలిపారు. టెక్మాల్ పోలీస్ స్టేషన్ పరిధి బొడ్మట్ పల్లి చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీల్లో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా సరైన ఆధారాలు చూపించకుండా అభినవ్ పాటిల్ అనే వ్యక్తి ఈ రోజు 1,00,000/- రూపాయలను తరలిస్తుండగా పట్టుకుని సీజ్ చేసామని ఇలా అధారాలు లేని నగదు,నగలు, ఇతరత్రా సొత్తును సీజ్ చేసి, సంబంధిత అధికారులకు అప్పగిస్తామని తెలిపారు. ఎన్నికల నిబంధనల మేరకు రూ. 50 వేలకు మించి నగదు తీసుకువెళ్లరాదని, పెద్ద మొత్తంలో నగదు, ఆభరణాలు ఉంటే తప్పనిసరిగా వెంట సంబంధిత పత్రాలు ఉండాలని సూచించారు. అలాగే తనిఖీలు చేస్తున్న పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు.