మంత్రి సీతక్క గారి ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షులు అశోక్ గారి సూచనల మేరకు గోవిందరావుపేట మండల కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు…
రాహుల్ గాంధీ గారు ప్రధాని అవడమే లక్ష్యంగా, మహాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ గారి గెలుపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం..
మండల కేంద్రంలోని 81వ బూత్ నందు ఎన్నికల ప్రచారం మొదలు పెట్టిన మండల ఇంఛార్జి మరియు మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు రేగ కళ్యాణి గారు…
తేది: 01.05.2024 బుధవారం అనగా ఈరోజున గోవిందరావుపేట మండల కేంద్రంలో మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ అధ్యక్షతన గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించగా అట్టి ఎన్నికల ప్రచారానికి ముఖ్య అతిథిగా మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు మరియు మండల ఇంఛార్జి రేగ కళ్యాణి గార్లు విచ్చేసి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి మహబూబ్ బాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భముగా రేగ కళ్యాణి గారు 81 వ బూత్ నందు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ప్రతి గడప గడపకు తిరుగుతూ ప్రజలకు గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాల గురించి చెబుతూ బలరాంనాయక్ గారు చేసిన మంచి పనుల గురించి ప్రజలకు తెలియజేస్తూ హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రతి ఒక్కరినీ కోరారు. అలాగే రాహుల్ గారి కుటుంబం త్యాగాల కుటుంబం అని, ప్రధాని అయ్యే అవకాశం ఉన్న కూడా ప్రధానమంత్రి పదవిని తృణపాయంగా వదిలిపెట్టిన నిరాడంబరుడు అని అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడే ఇందిరమ్మ ఇండ్లు, రైతు రుణమాఫీ, ఇందిరా జల ప్రభ ద్వారా బోర్లు, రాజీవ్ ఆరోగ్య శ్రీ, 108, 104 అత్యవసర సేవలు, పంట రుణాలు, సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, ఉచిత విద్యుత్, ఉపాధి హామీ పథకం, అటవీ హక్కుల చట్టం, ప్రాజెక్టులు, వంతెనలు, ఆనకట్టలు, పంచవర్ష ప్రణాళికలు, ఆర్థిక ప్రణాళికలు, భారీ, మధ్య మరియు చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి లాంటి ఎన్నో పథకాలతో పేదరిక నిర్మూలనా చేసింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గరి నుండి ఒక్కరికీ కూడా ఒక ఇల్లు ఇచ్చిన దాఖలా లేదు అని, తెలంగాణ రాష్ట్రానికి ఒరగబెట్టిందేమి లేదు బీజేపీ పార్టీ అని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక నల్ల ధనాన్ని బయటకి తీసి జన్ ధన్ ఖాతాలో పేదలకు 15 లక్షల రూపాయలు వేస్తానని పదిహేను పైసలు కూడా ఇవ్వలేదని, ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసిందని, సామాన్యుడు బ్రతలేని స్థాయికి తీసుకువచ్చిందని, నిత్యావసర సరుకుల ధరలు, క్రూడాయిల్ ధరలు కూడా భారీగా పెంచి ప్రతి పేదవాడికి భారంగా మారిందని అన్నారు. జీఎస్టీ ద్వారా సామాన్యుడి నడ్డి విరిచి, మానవత్వాన్ని మంట కలుపుతూ మత విద్వేషాలను రెచ్చగొడుతుంది అని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే
- రైతు భరోసా పథకం ద్వారా రైతులకు రైతుబంధు 15000/- రూపాయలకే రైతు కూలీలకు 12000/- రూపాయలు, పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తూ, వరి పంటకు క్వింటకు 500/- రూపాయల బోనస్ అందించబడును.
- ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఇల్లు లేని వారికి 5 లక్షల రూపాయలతో ఇంటి నిర్మాణం, తెలంగాణ ఉద్యమ కారులకు 250 గజాల ఇండ్ల స్థలం అందించబడును.
- యువ వికాసం పథకంతో విద్యార్థులకు 15 లక్షల రూపాయల విద్య భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూళ్లు కట్టించి నాణ్యమైన విద్యను అందించబడును.
- మహాలక్ష్మి పథకంతో ప్రతి మహిళకు నెలకు 2500/- రూపాయలు ఉచితంగా ఇవ్వబడును. 500/- రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించబడును. మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం కల్పించబడును.
- గృహజ్యోతి పథకంతో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించబడును.
- చేయూత పథకంతో ప్రతి నెల వృద్దులకు, వికలాంగులకు 4000 రూపాయల ఫించన్ అందించబడును. అలాగే రాజీవ్ ఆరోగ్య శ్రీ ద్వారా 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిచబడును. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం, రాజీవ్ ఆరోగ్య శ్రీ ద్వారా 10 లక్షల వరకు ఉచిత వైద్యం, ప్రతి నియోజకవర్గానికి మొదట విడతగా 3500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరిగిందని, అలాగే ఆగస్టు 15 వరకు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని కావున ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి పోరిక బలరాంనాయక్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు రామచంద్రపు వెంకటేశ్వర్ రావు, ఎంపీటీసీ గోపిదాసు ఏడుకొండలు, జంపాల చంద్రశేఖర్, మండల అధ్యక్షురాలు మద్దాలి నాగమణి, జిల్లా కార్యదర్శి సూదిరెడ్డీ జయమ్మ, డొంక వెంకన్న, గోపీదాసు వజ్రమ్మ, గోపీదాసు రజిత, మిరియాల కృష్ణ, సింగాపురం కృష్ణ, మాజిత, పులుసం లక్ష్మి, వంగూరి వెంకటరమణ, చింతల సత్యనారాయణ రెడ్డి, మాచినేని వెంకటేశ్వర్ రావు, మిరియాల లక్ష్మి, నన్నెబోయిన కృష్ణ స్వామి, జనార్ధన్, అనిత, నాగమణి, జెట్టి రాజు, శరత్, కనకం నారాయణ, రత్నం సమ్మయ్య, నామవరపు బాబు తదితర రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు పాల్గొన్నారు.