మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం

Reporter -Silver Rajesh Medak.

Date-27/04/2024.

తెలంగాణ ప్రభుత్వం హయాంలో మెదక్ కు 100 సీట్ల మెడికల్ కాలేజీని మంజూరు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే రోహిత్ రావు 50 సీట్లకి మెడికల్ కాలేజీని కుదించడం మెదక్ అభివృద్ధిని అడ్డుకున్నట్లే అవుతుందన్నారు.

మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మెదక్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ… మరో 50 సీట్లతో కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెడికల్ కాలేజీని ప్రారంభించడం బాధాకరమని అన్నారు . కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఎంతో తీవ్ర నష్టం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ప్రజలకు నష్టం తెచ్చింది అన్నారు.పదేళ్లలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఏమి చేయలేదన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు కు జాతీయ హోదా కల్పించలేకపోయింది అన్నారు.

జన్ ధన్ ఖాతా ద్వారా అక్క చెల్లెళ్లకు 15 లక్షలు ఇస్తామని మాట తప్పారు.గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుకుంటూ సామాన్య ప్రజల నడ్డివిరిచరు అని పేర్కొన్నారు..దుబ్బాకలో అనేక హామీలు ఇచ్చి ఓటమిపాలైన రఘునందన్ ను మెదక్ బిజెపి అభ్యర్థిగా ఉంచారు. ఇక్కడ ప్రజలను అతన్ని ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో ముందుకు వచ్చిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రమిరెడ్డి గెలిపించాలని కార్యకర్తలకు ప్రజలకు సూచించారు.

వెంకట్రామిరెడ్డి మంచి చదువుకున్న వ్యక్తి అని అన్నారు. కాంగ్రెస్ ను బిజెపిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 6గారెంటీలను అమలు చేయలేకపోయారు ప్రజలను మోసం చేశారని అన్నారు. ఏడుపాయల దేవస్థానం కు గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 100 కోట్లు నిధులు మంజూరు చేస్తూ జీవో జారీ చేశారు, ఆ నిధులు ఏమయ్యాయి అని స్థానిక ఎమ్మెల్యే ను ప్రశ్నించారు.

అనంతరం నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ… కాంగ్రెస్ వచ్చింది ప్రజలకు కష్టాలు తెచ్చింది అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గారెంటీలను 420 హామీలను అమలు చేయడంలో విఫలమయిందని అన్నారు. అదేవిధంగా డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని మాట తప్పారు, రైతు భరోసా పెంచుతామన్నారు పెంచలేరు. కెసిఆర్ హయాంలో కేసీఆర్ చేసిన అభివృద్ధిని ప్రజలు గుర్తించి కెసిఆర్ బి ఫాం ఇచ్చి బలపర్చిన వెంకట్రాం రెడ్డినీ భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు సూచించారు.

ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, మాజీ గ్రంథాలయ చైర్మన్ చంద్ర గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు కృష్ణ రెడ్డి,మామిళ్ళ ఆంజనేయులు జయరాజ్,కిషోర్, బట్టి. లలిత తదితరులు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!