Reporter -Silver Rajesh Medak.
Date-27/04/2024.
నార్సింగిలో ..
కదిలొచ్చిన నారీమణులు..
ఎంపీ అభ్యర్థి నీలం మధు రోడ్ షో…
ప్రచారంలో ముందు భాగాన మహిళలు..
పెదోళ్లకు అండగా నిలిచే నీలం మధన్నకే తమ మద్దంటూ నార్సింగిలో నారీమణులు కదిలిచ్చారు. మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో భాగంగా నార్సింగి పట్నానికి చేరుకున్న ఎంపీ అభ్యర్థి రోడ్ షోకు మహిళలు భారీ ఎత్తున తరలివచ్చి, ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా మహిళలు అగ్ర భాగాన నిలిచి ప్రచారంలో పాలుపంచుకున్నారు. దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఎంపీ అభ్యర్థి నీలం మధు ప్రచార రథం నుంచి అభివాదం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఈ సందర్భంగా ఓటర్లను అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యులు, నేతలు శ్రీనివాస్ గౌడ్, సత్యనారాయణ గౌడ్, ఆంజనేయులు గౌడ్, రాజేష్, దేవదాస్, సిహెచ్ ప్రభాకర్, మండల నాయకులు, యువజన కాంగ్రెస్, NSUI కార్యకర్తలు పాల్గొన్నారు.
గెలిపించండి…
అభివృద్ధి బాధ్యత నాదే..
నార్సింగి కార్నర్ మీటింగ్ లో నీలం మధు
ఈ పార్లమెంటు ఎన్నికలలో తన భారీ మెజారిటీతో గెలిపించండి.. మెదక్ ప్రాంత అభివృద్ధికి పూర్తి బాధ్యత తీసుకుంటానని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నార్సింగ్ రోడ్ షో తర్వాత నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో నీలం మధు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఆయంలోని పేదలకు ఇండ్లు, భూములు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ ద్వారానే మెదక్ అభివృద్ధి జరిగిందని, ఆమె ఎంపీగా ఉన్న సమయంలోనే మీద ప్రాంతంలో కంపెనీలు ఫ్యాక్టరీలు నెలకొల్పడం జరిగిందని గుర్తు చేశారు. బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు పేద ప్రజలకు ఏం చేశాయో?చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రజా పాలనలో అమలవుతున్న పథకాలతో పేదలకు లాభం చేకూరిందన్నారు. అలాగే ఈ ప్రాంతంలో యువతకు ఉపాధి కల్పించే బాధ్యత కూడా తీసుకుంటానని చెప్పారు. ఇందుకోసం స్వయంగా ఆరు నెలలకు ఒకసారి జాబ్ మేళా ఏర్పాటు చేసి, వారికి ఉపాధి చూపేందుకు కృషి చేస్తానన్నారు. నార్సింగిలో ప్రధానంగా ఎదుర్కొంటున్న హైవే రోడ్డుపై బ్రిడ్జి తో పాటు, ఇతర సమస్యలను పరిష్కరిస్తానని ఈ సందర్భంగా నీలం మధు హామీ ఇచ్చారు. తనను భారీ మెజారిటీతో గెలిపించి ప్రజా సేవ చేసే భాగ్యం కల్పించాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం ఎంపీ అభ్యర్థి నీలం మదును కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా సన్మానించాయి.