మెదక్ జిల్లా నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో మున్నూరు కాపు పలు కుల సంఘాలకు చెందిన సుమారు వెయ్యి మంది వరకు కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు ముత్యంరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వారికి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ.. బిఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలుగా పరిపాలించి ఏమి అభివృద్ధి చేసిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల్లోనే మెదక్ జిల్లా కేంద్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించానని, నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలకు అభివృద్ధి నిధులు కేటాయించామని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేస్తామని నిరుపేదల సంక్షేమ అభివృద్ధి కోసం కృషి చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.