Venkatramulu Ramayampet Reporter
మెదక్ జిల్లా నిజాంపేట మండల బిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలిందని చెప్పవచ్చు.శనివారం నాడు మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.మైనంపల్లి రోహిత్ రావు సమక్షంలో నిజాంపేట మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు నందిగామ బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ లద్ధ ప్రీతి చల్మెడ ముత్యంరెడ్డి అధ్యక్షతన మైనంపల్లి రోహిత్ రావు కాంగ్రెస్ పార్టీ కండూవాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలోకి స్వచ్ఛందంగా నందిగామ బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ లద్ధ ప్రీతి కాంగ్రెస్ పార్టీలోకి చేరినట్లు తెలిపారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కచ్చితంగా పార్లమెంట్ సీటును భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ కైసవం చేసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట మండల నందిగామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.