వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో రౌడీ సంస్కృతి విపరీతంగా పెరిగిపోయిందని,రాజకీయ హత్యలు చాలా జరిగాయాయని, దళితులను, సామాన్యులను వైసీపీ ప్రభుత్వం పొట్టన పెట్టుకుందని,రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నాయకులకు , ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రియాంక దండి ఆరోపించారు. సిబిఐ అధికారిగా వి.వి లక్ష్మీనారాయణ గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసు విచారించి, అతనిని జైలుకి పంపారాని ఆ కోపంతో గాలి జనార్దన్ రెడ్డి అనుచరుడు నంబలా రాజేష్ సిబిఐ మాజీ లక్ష్మీనారాయణని అంతమోందించాలని చూస్తున్నాడని, ఎన్నికల సమయంలో రాజేష్ వైసీపీ ఉత్తర నియోజకవర్గ అభ్యర్థితో ఉండడం పలు అనుమానాలకు దారి తీస్తోందని, కేకే రాజుకి గాలి జనార్దన్ రెడ్డికి ఉన్న సంబంధం ఏంటని ఆమె ప్రశ్నించారు. పోలీస్ వారు నంబలా రాజేష్, కేకే రాజు కదలికల పైన నిఘా పెట్టాలని ఆమె విజ్ఞప్తి చేసారు. వైసీపీ గెలిస్తే ప్రశాంత విశాఖ భవిష్యత్తులో దోపిడీ దారుల వసం కాబోతోందని, విశాఖ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని ఓటు వెయ్యాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేసారు.