అగ్నిప్రమాదం వలన ఇల్లు దగ్ధం అయి నష్టపోయిన బాధితులను పరామర్శించి, అండగా నిలబడిన ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ గారు…
అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించి, తక్షణమే అధికారులకు ఆస్తి నష్టాన్ని అంచనా వేసి బాధితులకు న్యాయం చేకూర్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు…
బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ..
బాధితులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇల్లు దగ్ధం అయినవారికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం…
తేది: 27.04.2024 శనివారం అనగా ఈరోజున ములుగు మండల కొత్తూరు గ్రామం నందు అగ్ని ప్రమాదం జరుగగా వెంటనే అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశానికి ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ గారు చేరుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధితుల కుటుంబాలకు అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు. అలాగే అశోక్ గారు అగ్ని ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని వెంటనే స్థలాన్ని పరిశీలించి అగ్ని ప్రమాదంలో దగ్ధం అయిన ఇండ్లు, సరుకులను పరిశీలించి సంబంధిత అధికారులకు వెంటనే నష్టాన్ని అంచనా వేసి నష్ట పరిహారం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే అగ్ని ప్రమాదంలో ఇండ్లు కోల్పోయిన కస్తూరి నాగార్జున మరియు కస్తూరి ఐలేష్ గార్లను వారి కుటుంబాలను ఓదార్చి, వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అలాగే పూర్తిగా దగ్ధం అయిన ఇండ్లను చూసి చలించి వారికి తన వంతు సహాయంగా నిత్యావసర సరుకులు అందించారు. అలాగే అగ్ని ప్రమాదంలో ఇండ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇండ్లు ద్వారా ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రేస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్, బ్లాక్ కాంగ్రేస్ అధ్యక్షులు బైరెడ్డి భగవాన్ రెడ్డి, ములుగు సహకార సంఘం అధ్యక్షులు బొక్క సత్తిరెడ్డి, ములుగు మండల అధ్యక్షులు ఎండి. చాంద్ పాషా, మండల వర్కింగ్ ప్రెసిడెంట్లు బండి శ్రీనివాస్, నల్లెలభరత్ కుమార్, ములుగు మండల యూత్ అధ్యక్షులు కుక్కల నాగరాజు, యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ బండి మధు, ఎంపీటీసీ మావూరపు తిరుపతిరెడ్డి మరియు జిల్లా,మండల తదితర నాయకులు పాల్గొన్నారు.