-అసోసియేట్ డీన్ డాక్టర్ జయలక్ష్మి
స్టూడియో 10 టీవీ న్యూస్ , ఏప్రిల్ 24, మహానంది : విద్యార్థులు ప్రభుత్వం కల్పించినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జయలక్ష్మి పేర్కొన్నారు. మహానంది ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ కళాశాలలో విద్యార్థులకు సోమ, మంగళ, బుధవారం మూడు రోజులపాటు పోటీ పరీక్షల పై శిక్షణ తరగతులను అసోసియేట్ డీన్ డాక్టర్ జయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి, సి ఐ (ఏ ఆర్) వ్యవసాయ విభాగం, ఎస్సీ సబ్ ప్లాన్ ఉప పథకం 2023-24 వచ్చిన నిధుల నుండి, విద్యార్థులకు శిక్షణా తరగతులు నిర్వహించడం జరిగిందన్నారు. ప్రతి విద్యార్థి ప్రభుత్వ ఉద్యోగం సాధించటం కల అని, విద్యార్థులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో జరిగే పోటీ పరీక్షలకు, సన్నద్ధం కావడానికి, ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ సెల్ డాక్టర్ .వెంకటేష్ బాబు, ఓ ఎస్ ఏ .విజయభాస్కర్, విద్యార్థులు పాల్గొన్నారు.