-స్టాటిస్టికల్ సర్వైవ్ టీమ్ హెడ్,డిప్యూటీ తహసిల్దార్ శ్రీనివాసులు
స్టూడియో 10 టీవీ న్యూస్ , ఏప్రిల్ 25, మహానంది:
ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాలని స్టాటిస్టికల్ సర్వైవ్ టీమ్ హెడ్, మహానంది డిప్యూటీ తహసిల్దార్ శ్రీనివాసులు తెలిపారు. మహానంది మండలం గాజులపల్లె గ్రామ పరిధిలోని ఆంజనేయపురం చెక్ పోస్ట్ వద్ద గురువారం వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు నంద్యాల గిద్దలూరు జాతీయ రహదారి మార్గంలో వెళ్లే, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో, అక్రమంగా మద్యం, డబ్బు రవాణా జరగకుండా, ప్రతి వాహనా న్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, వాహనదారులందరూ ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ లింగా ప్రసాద్, తలారి కాశయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.