పేరుకే చలివేంద్రం తడుక తీయరు నీళ్లు పోయార గురువారం భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ గొడిసెల కార్తీక్ జిల్లా కార్యదర్శి అన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ని వివేకానంద చౌక్ వద్ద పురపాలక సంఘం ఆధ్వర్యంలో గత నెలలో కమిషనర్ వచ్చి చలివేంద్రాన్ని ప్రారంభించారని, ఒకే రోజు ప్రజలకు చలివేంద్రం నుంచి త్రాగునీరు ఇచ్చారు అప్పటినుంచి ఇప్పటివరకు చలివేంద్రం మూసి ఉంది తీవ్రమైన ఎండలు ఉన్నాయని ప్రజలు దప్పికా తీర్చుకోవడానికి తీవ్రమైన ఇబ్బందులు పడుతుంటే చలివేంద్రంలు ఫోటోలో కోసమే ప్రారంభించి మూసివేయడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు.ఇంకా నెల రోజులు ఎండలు ఉన్నాయని ప్రజలు త్రాగునీటి కోసం ఇబ్బందులు పడతారు ఇప్పటికైనా ఆ చలివేంద్రాన్ని ప్రారంభించాలనీ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ గా కోరుతున్నామని గొడిసెల కార్తీక్ జిల్లా కార్యదర్శి తెలిపారు.