Reporter -Silver Rajesh Medak.
తేదీ 20-4-3024.
వరి ధాన్యం తడవకుండా చర్యలు చేపట్టాలి
డి ఆర్ డి ఓ, డిసిఓ, జిల్లా సివిల్ సప్లై మేనేజర్, వరి ధాన్యం సేకరణ అధికారులతో టెలికాన్ఫరెన్స్ లో
— జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు
రానున్న రెండు రోజుల్లో తెలంగాణ జిల్లాలో వాతావరణ సమతుల్యతలతో వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతుల పండించిన ధాన్యం, తడవకుండా, నష్టపోకుండా నివారణ చర్యలు చేపట్టాలని అధికారుల ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అకాల వర్షాల వల్ల తడవకుండా చర్యలు చేపట్టాలని ,అదనపు టార్పిండ్లను అందుబాటులో పెట్టుకోవాలని, రిజిస్టర్ సక్రమంగా నిర్వహించాలని, ఉన్నతాధికారుల క్షేత్రస్థాయిలో పరిశీలనకు వచ్చినప్పుడు కొనుగోలు కేంద్రాల సమగ్ర సమాచారం కొనుగోళ్లు ,రవాణా, చెల్లింపుల రిజిస్టర్లు నిర్వహణ సక్రమంగా నిర్వహించాలన్నారు.