Reporter -Silver Rajesh Medak.
తేదీ20-4-2024.
సార్వత్రిక 10 వ తరగతి ,ఇంటర్ పరీక్షలు పక్డ్బందీ గా నిర్వహించాలి జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు
ఈనెల 25 నుండి ప్రారంభమయ్యే సార్వత్రిక 10వ తరగతి ,ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేయవలసినదిగా జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు.
శనివారం కలెక్టరేట్ లోని విడియో కాన్ఫరెన్స్ హాలు లో సార్వత్రిక 10వ తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై డి.ఇ.ఓ రాధా కిషన్ తో తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ అత్యంత జాగరూకతతో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని, ఏ చిన్న పొరపాటు జరిగినా విద్యార్ధుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని అన్నారు.
పరీక్షలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా అనుబంధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రం లోకి చేరుకోవాలన్నారు.
జిల్లాలో పదవ తరగతిలో 680 మంది విద్యార్థులకు గాను మెదక్, నర్సాపూర్ ,తూప్రాన్ లో మూడు కేంద్రాల ఏర్పాటు చేయబడినయని
ఇంటర్మీడియట్ లో 1060 మంది విద్యార్థులకు గాను మెదక్( 2) నర్సాపూర్( 2 ),తూప్రాన్( 1 ) మొత్తం ఐదు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి అన్నారు.
ప్రతి పరీక్షా కేంద్రంలో ఒక సిట్టింగ్స్ స్క్వార్డు ను నియమించినట్లు తెలిపారు.
పరీక్షా కేంద్రాల్లో వైద్య సిబ్బంది నిరంతరాయంగా విద్యుత్తు త్రాగునీరు , రవాణా సౌకర్యాలు కల్పించాలని అధికారుల ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ ,ఆర్టీసీ మేనేజర్ సుధా, పోస్టల్ అధికారి దౌలత్ భాషా, విద్యుత్ అధికారి మోహన్ బాబు, మెదక్ టౌన్ సిఐ దిలీప్ కుమార్, పరీక్ష సహాయ కమిషనర్ రామేశ్వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.